New Year: రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్.. దొరికితే రూ.10 వేల ఫైన్..
తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ నేపథ్యంలో పోలీసు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దని కోరారు. క్యాబ్, ఆటో బుక్ చేసుకుని వెళ్లాలని కోరారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్ట్‌లు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
వాహనాలు సీజ్ చేయడంతో కేసు నమోదు చేసి రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అలాగే ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని పోలీస్ కమిషనరేట్లు, ఎస్‌పీ ఆఫీసులను డీజీపీ కార్యాలయం సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్స్ పరిధిలో చెక్‌పాయింట్స్, బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లు తప్పనిసరి చేయాలని స్పష్టం చేసింది.

న్యూ ఇయర్వెంట్స్కు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఎవరైనా కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చెక్‌పాయింట్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్‌ఐ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డ్రంకెన్డ్రైవ్తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు డ్రగ్ డిటెక్షన్స్‌ను టెస్ట్‌లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీ న్యాబ్) ఇప్పటికే120 డ్రగ్ డిటెక్షన్ పరికరాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ (బాలానగర్), శిల్పా లేఅవుట్ ఫ్లై ఓవర్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, గచ్చిబౌలి ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌లు (1&2), షేక్‌పేట ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్-JNTU ఫ్లై ఓవర్, రోడ్ నెం.45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ వంతెన, సైబర్ టవర్ ఫ్లై ఓవర్ మూసివేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లై ఓవర్లను మూసివేయనున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications