Egg Price: పెరిగిన కోడి గుడ్ల ధర.. కారణమేమిటంటే..!

హైదరాబాద్ లో కోడి గుడ్ల ధరలు పెరుగుతోన్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, కోళ్ల మరణాల రేటు పెరగడమే గుడ్డు ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత నెల రోజులుగా గుడ్డు ధరలు స్వల్పంగా తగ్గినా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. గత వేసవితో పోలిస్తే నగరంలో గుడ్ల ధర గణనీయంగా పెరిగింది. 100 గుడ్ల ధర గతేడాది మే 4న రూ.420 ఉండగా, ఈ ఏడాది రూ.445కి పెరిగింది.

ఏప్రిల్ 5 నుంచి మే 4 మధ్య ఒక్కో గుడ్డు ధర 70 పైసలు పెరిగింది. ఉదాహరణకు ఏప్రిల్ 5న రూ.4.35 ఉన్న గుడ్డు ఇప్పుడు మే 5 నాటికి రూ.5.25కి పెరిగింది. గత ఐదు రోజులలో ధర ఎక్కువగా పెరిగింది. మే 1న రూ.4.25 నుండి మే 5న రూ.5.25కి చేరుకుంది. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా, వేసవి వేడి కారణంగా గుడ్ల ఉత్పత్తి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

The prices of chicken eggs are increasing gradually

దేశంలోని కొన్ని ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా గత సంవత్సరం తక్కువ ధరలు ఉన్నాయి. ఏప్రిల్ 16న రూ.400కి చేరాయి. ఆ తర్వాత రెండు రోజుల్లో రూ.410కి స్వల్పంగా పెరిగాయి. అయితే ఏప్రిల్ 21న రూ.390కి తగ్గింది. తాజాగా రూ.445కి పెరిగింది. చికెన్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. నగరంలో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 పలుకుతోంది.

కూరగాయలు ధరలు కూడా క్రమంగా పెరుగుతోన్నాయి. కిలో రూ.20 ఉన్న టమాటా తాజాగా కిలో రూ.30 నుంచి రూ.35 పలుకుతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+