Hyderabad: హైదరాబాద్ ను కమ్మేసిన మబ్బులు.. పలు చోట్ల జల్లులు..

తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున చిరు జల్లులు పడ్డాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి అనేక ప్రాంతాల్లో ముసురు పడింది. ఖైరతాబాద్, లక్డీకపూల్, ప్రగతి నగర్, పంజాగుట్టా చార్మినార్, కోటి, హిమాయత్ నగర్, అమీర్ పేట్, జూబ్లీ హిల్స్, మియాపూర్, బీరంగూడ కూకట్ పల్లి, బంజారాహిల్స్, ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో చలి తీవ్రత తగ్గింది. 10 రోజుల క్రితం చలి తీవ్రత ఎక్కువగా ఉండేది.

తుఫాన్ కారణంగా చలి తీవ్రత తగ్గిపోయింది. వచ్చే ఐదారు రోజుల్లో ఉదయం వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ తెలిపింది. డిసెంబరు 11 వరకు తేలికపాటి వర్షపాతం లేదా చినుకులు కొనసాగుతాయని అంచనా వేసింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, LB నగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లి జోన్లలో వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లో శీతాకాలపు వర్షాలు కురుస్తుండగా, ఉష్ణోగ్రతలు ఓ మోస్తరుగా ఉన్నాయి.

The sky in Hyderabad was cloudy and light showers occurred at many places

నిన్న ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీనికి తోడుగా ఉపరితల ఆవర్తనం కూడా ఉండడంతో రాష్ట్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఆదివారం రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుక అవకాశం ఉన్నట్లు తెలిపింది.

అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+