Hyderabad Collector: హైదరాబాద్ కలెక్టర్‍గా అతి పిన్న వయస్కుడు.. అతను ఎవరంటే..!

హైదరాబాద్ కలెక్టర్‌గా అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తి బాధ్యతలు చేపట్టబోతున్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా 2018 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అనుదీప్‌ దురిశెట్టిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. దురిశెట్టి 2018 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. 2018లో ప్రగతి భవన్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అనుదీపు తల్లిదండ్రులను కలిసి భోజనానికి ఆహ్వానించారు. రాష్ట్రంలోని చాలా మంది యువకులకు అనుదీప్ రోల్ మోడల్ అని కేసీఆర్ కొనియాడారు.

కేవలం ఐదేళ్ల సర్వీసు ఉన్న ఐఏఎస్‌ అధికారి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. శుక్రవారం నాటికి 31 మంది IAS అధికారులు రాష్ట్రానికి బదిలీ అయ్యారు. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న పలువురికి పోస్టింగ్‌లు ఇచ్చారు. హైదరాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు, నిజామాబాద్‌కు కొత్త మున్సిపల్ కమిషనర్ ను నియమించారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉన్న అనుదీప్ దురిశెట్టి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

Collector of Hyderabad

అమోయ్ కుమార్‌ను హైదరాబాద్ కలెక్టర్ పూర్తి అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. అనుదీప్ స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్ పల్లి. అతను 1989 జులై 6 న జన్మించారు. రాజస్థాన్ బిట్స్ పిలానీలో బీటెక్ పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడంలో అనుదీప్ చేసిన పనికి ఓ పిల్లాడు అనుదీప్ ఫ్యాన్ అయ్యాడు.

దమ్మపేట మండలం జమేదార్ బంజర్‌కు చెందిన కుంజా వెంకటేశ్వర్లుకు ఓ భూ సమస్య ఉండడంతో గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అనుదీప్ సమస్యను పరిష్కరించారు. దీంతో అక్కడే బాధితుడి కుమారుడు అనుదీప్ కు ఫ్యాన్ అయ్యాడు. అనుదీప్ కలవాలని నాన్నతో చెప్పాడు. దీంతో తండ్రి కలెక్టర్ కార్యలయానికి వచ్చారు. బాలుడు హర్షవర్ధన్ అనుదీప్ ను కలిసి షేకండ్ ఇచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+