‘సైరా’ అపశృతి: బ్యానర్ కడుతున్న ఫ్యాన్స్‌కి విద్యుత్ షాక్
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ వ్యాప్తంగా సినీ అభిమానులకు పండగ వాతావరణం ఏర్పడింది. కాగా, సైరా చిత్రానికి సంబంధించిన బ్యానర్లు కడుతుండగా ముగ్గురు మెగా అభిమానులు గాయపడ్డారు.
చింతల్ వాజ్‌పెయ్ నగర్‌లో సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్( 23), రమేష్(27), చిరంజీవి( 30) అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం సాయంత్రం వాజ్ పాయ్ నగర్‌లోని ఓ భవనానికి ఉన్న సాహో బ్యానర్ తీసి బుధవారం విడుదల కానున్న సైరా నరసింహారెడ్డి సినిమా బ్యానర్ కడుతుండగా విద్యుత్ ఘాతంతో ముగ్గురు యువకులు కిందపడిపోయారు.

వెంటేనే వారిని బాలానగర్ బీబీఆర్ ఆసుపత్రి కి తరలించారు వారి స్నేహితులు. ఘటనపై కేసు నమోదు వేసుకున్న పేట్‌బషీరాబాద్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
సమసిన వివాదం..
సైరా రిలీజ్‌ను ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన తెలంగాణ కోర్టు స్పందిస్తూ.. తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా సినిమాను వినోదపరంగా చూడాలి. మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్టు చూపించడం సాధ్యం కాదు అని న్యాయమూర్తి వాఖ్యలు చేసినట్టు తెలిసింది. గతంలో చరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రాల్లో కూడా ఇదే స్పష్టమైంది అని పేర్కొన్నారు.

సైరా బయోపిక్ అని చెప్పి.. ఇప్పుడు చరిత్ర అని తప్పుదోవ పట్టిస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్‌ను టీఎస్ కోర్టు తోసిపుచ్చినట్టు సమాచారం. గతంలో గాంధీ, మొగల్ సామ్రాజ్యాన్ని తెరకెక్కించిన చిత్రాలను ఈ సందర్భంగా పిటిషన్ దారుల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతో సైరా రిలీజ్ అడ్డు తొలిగినట్టు అయింది.
సినిమా కేవలం వినోద పరంగా చూడాలి. సినిమా నచ్చేది.. నచ్చనిది ప్రేక్షకులకే వదలేయాలి. ఈ దశలో సినిమాను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. సైరా సినిమాపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమైంది.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
చిరంజీవికి సీనియర్ NTR సినిమాల్లో అదంటే మహా ప్రాణం.. ఎవరూ ఊహించనది -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications