హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు మెట్రో సేవలు ఎప్పటిలానే.. బంద్ లేదు: ఎండీ స్పష్టీకరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ మహానగరంలో రేపు (ఆదివారం) మెట్రో రైళ్లు సాధారణంగా నడవనున్నాయి. పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోడీ సభ ఉన్న సంగతి తెలిసిందే. దీంతోమెట్రో రైళ్లు నిలిపివేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో అధికారులు స్పష్టత ఇచ్చారు. సాధారణంగా మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. మెట్రో రైళ్లను నిలిపివేయబోమని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నందున ఇవాళ మెట్రో రైలు సేవలను నిలిపివేశారు. హెచ్ఐసీసీలో మీటింగ్ జరుగుతుంది. దీంతో రేపు ఏంటీ అనే చర్చ వచ్చింది. దానికి సంబంధించి నడవడం లేదు అనే ప్రచారం జరిగింది. దీంతో మెట్రో రైలు ఎండీ స్పందించారు. అదేం లేదని.. యథావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టంచేశారు.

tomorrow metro services continue:metro md nvs reddy

మెట్రో వల్ల సమయం ఆదా అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే చాలా మంది మెట్రో యూజ్ చేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత వచ్చే మెట్రోలో చాలా మంది జనాలు ఉంటున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. రేపు ఆదివారం అయినందున.. అంతగా రష్ ఉండకపోవచ్చు.. కానీ పనుల ఉన్నవారికి మాత్రం మేలు జరుగుతుంది.

మోడీ పర్యటన నేపథ్యంలో ఎస్పీజీ అధికారులు రంగంలోకి దిగారు. మోడీ ఉండే చోటును తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రెండురోజుల పాటు ఉంటారు. ఏపీలో 4వ తేదీ సోమవారం.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ పయనం అవుతారు. ఈ పర్యటనల వెనక.. ఎన్నికలే ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

English summary
tomorrow metro services continue in the city metro md nvs reddy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X