చర్లపల్లి నుంచి నడవబోతున్న సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇవే!
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లకు తోడు నాలుగో స్టేషన్ గా చర్లపల్లి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మార్చి మొదటివారంలో ఈ స్టేషన్ ను జాతికి అంకితం చేయబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి 25 రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన అనుమతులివ్వాలంటూ రైల్వేబోర్డుకు లేఖ రాశారు.
ప్రస్తుతం 6 ఎక్స్ ప్రెస్ రైళ్లను అక్కడి నుంచి నడిపేలా అనుమతులు లభించాయి. మరో 12 రైళ్లను చర్లపల్లిలో ఆపేందుకు అనుమతులు వచ్చాయి. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తోపాటు ఇతర జోన్ల జనరల్ మేనేజర్లకు రైల్వే బోర్డు ఆదేశాలు జారీచేసింది. మార్పులకు సంబంధించిన సమాచారం ప్రజలంతా తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. చర్లపల్లి రైల్వేస్టేషన్ ను ఎప్పటినుంచి వినియోగించుకోవాలనే నిర్ణయాన్ని కూడా స్థానిక అధికారులకే కట్టబెట్టింది.

చర్లపల్లి నుంచి ప్రారంభం కాబోతున్న రైళ్లు
18045 షాలిమార్ - హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
18046 హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12604 హైదరాబాద్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12589/12590 గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ - గోరఖ్ పూర్
చర్లపల్లి స్టేషన్ లో ఆగే రైళ్ల వివరాలు
17011/17012 హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12757/12758 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్
17233/17234 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
12713/123714 విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్
12705/12706 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్












Click it and Unblock the Notifications