ప్రత్యక్ష పొత్తు.. పరోక్ష పొత్తు.. అసలు టీఆర్ఎస్ మర్మమేంటి?
హైదరాబాద్ : కారు మనదే, స్టీరింగ్ మనదే అంటూ ఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారాయి. మజ్లిస్ పోటీచేయని స్థానాల్లో కారుకు సపోర్ట్ చేయాలని పిలుపునివ్వడంపై టీఆర్ఎస్ వైరి వర్గాలు మండిపడుతున్నాయి. ఏ పార్టీతో పొత్తు లేదంటూనే గులాబీ అధినేత కేసీఆర్ చేస్తున్న ఈ చాటుమాటు రాజకీయాల్లేంటి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ తో కలిసి ముందుకు పోదామని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఒక్క స్థానం దక్కకుండా 17 సెగ్మెంట్లలో విజయం సాధిద్దామని కేసీఆర్ పిలుపునివ్వడం దేనికి సంకేతమని కొందరు ప్రశ్నిస్తున్నారు.
టీఆర్ఎస్ తో మనకు పొత్తుందని, కారు గుర్తుకు ఓట్లు వేయాలని బహిరంగ సభల్లో పిలుపునిస్తున్నారు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ. తాజాగా జూబ్లీహిల్స్ ప్రచార సభలో ప్రసంగించిన అసద్.. కారు స్టీరింగ్ మన చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు బీజేపీకి, ప్రజాకూటమికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. దీంతో టీఆర్ఎస్, మజ్లిస్ పొత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెరచాటు పొత్తులా..! ధైర్యం లేదా?
కారుకు మద్దతుగా అసదుద్దీన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రత్యక్ష పొత్తును సూచిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి వైరి వర్గాలు. ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు గిత్తు లేదంటూ టీఆర్ఎస్ అధినేత తెరచాటు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నాయి. అసలు టీఆర్ఎస్ కు మజ్లిస్ తో పొత్తేంటని విమర్శలు గుప్పిస్తున్నాయి. అసదుద్దీన్ కారుకు ఓటేయ్యాలని చెప్పడం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మజ్లిస్ తో పొత్తు ఉంటుందని కేసీఆర్ ప్రకటించడం దేనికి సంకేతాలని ప్రశ్నిస్తున్నాయి.
అదలావుంటే కేసీఆర్ బీజేపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాటల దాడికి దిగుతున్నారు. ఓటమి భయంతో ఇటు మజ్లిస్ తో, అటు బీజేపీతో కేసీఆర్ జతకట్టారని ఆరోపిస్తున్నారు. ప్రజా కూటమిని క్షేత్రస్థాయిలో ఎదుర్కోలేక ఇలాంటి తెరచాటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పొత్తులు పెట్టుకుంటే తమలాగా ధైర్యంగా బరిలోకి దిగాలే గానీ.. ఈ చాటుమాటు పొత్తుల వ్యవహారమేంటో అని ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ అటు ఇటైతే..!
కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు జతకట్టిన ప్రజా కూటమే తమకు ప్రధాన ప్రత్యర్థిగా అభివర్ణిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంటూ ఉందంటే ప్రజా కూటమికి, గులాబీదండుకు మాత్రమేనంటూ సెలవిస్తున్నారు. బరిలో నిలిచిన బీజేపీని ఏ మాత్రం టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు. అడపాదడపా మోడీపై మాత్రం సెటైర్లు విసురుతున్నారు. అంటే ఇటు మజ్లిస్ కు దగ్గరగా ఉంటూనే.. అటు బీజేపీని కూడా మెయిన్టెన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. మరి ఎంఐఎంతో రాజకీయ వైరం ఉన్న బీజేపీ.. ప్రచార సభల్లో టీఆర్ఎస్ ను చెడుగుడు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీకి టీఆర్ఎస్ తో ఎలాంటి ఉపయోగం లేదు. అయితే ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అనుకున్నదానికి ఒకవేళ అటు ఇటైతే ముందస్తు ఒప్పందాల ప్రకారం మజ్లిస్, బీజేపీ సహకారంతో గట్టెక్కొచ్చానేది కేసీఆర్ ప్లాన్ అంటున్నారు కొందరు.

అందుకేనా మజ్లిస్ తో..!
రాష్ట్రంలో ఎక్కడా కనపడని ఎంఐఎం హవా హైదరాబాద్ కే పరిమితమయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పాతబస్తీలో ఆ పార్టీ బలం బాగానే ఉంది. ఇదే పాయింట్ కేసీఆర్ ప్లస్ గా తీసుకున్నారేమో. ఒకవేళ మజ్లిస్ తో జతకడితే హైదరాబాద్ తప్ప మిగతా చోట్ల కాంప్రమైజ్ తలనొప్పులు ఉండవని భావించినట్లున్నారు. హైదరాబాద్ లో వాళ్లు చెప్పినదానికి తల ఊపితే.. రాష్ట్రమంతటా ముస్లిం మైనార్టీల ఓట్లు టీఆర్ఎస్ కు కలిసొస్తాయనేది కేసీఆర్ స్కెచ్ లా కనిపిస్తోంది.
అదలావుంటే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 60 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండాలి. అయితే టీఆర్ఎస్ ఒకవేళ అన్ని స్థానాల్లో విజయం సాధించకుంటే ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే కేసీఆర్ ఇటు మజ్లిస్ తో ప్రత్యక్ష పొత్తు, అటు బీజేపీతో పరోక్ష పొత్తు నెరపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏం జరుగుతుందనేది డిసెంబర్ 11 వరకు వెయిట్ చేయాల్సిందే.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications