Hyderabad: హైదరాబాదీలకు శుభవార్త.. అందుబాటులోకి రానున్న రెండు ఫ్లైఓవర్..!

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎట్టకేలకు ఎట్టకేలకు 1.5 కిలోమీటర్ల పొడవైన అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్ సిటీ వాసులకు అందుబాటులోకి రానుంది. ఫ్లైఓవర్‌ను త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఫ్లై ఓవర్ కు సంబంధించి చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. నాలుగు లేన్ల ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందని భావిస్తున్నారు. వరంగల్ హైవే నుంచి నగరంలోకి వచ్చే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది.

ఫ్లైఓవర్ కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఫ్లై ఓవర్ గోల్నాక దగ్గర ప్రారంభమై MCH క్వార్టర్స్ సమీపంలోని పూర్ణోదయ కాలనీలో ముగుస్తుంది.హైదరాబాద్ అంబర్‌పేట్ ఫ్లైఓవర్ 2018లో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కానీ 2021లో పనులు ప్రారంభమయ్యాయి. 2023లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ గుత్తేదారులు నిర్లక్ష్యం వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. లేకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించడంతో పనులు త్వరగా ముగిశాయి.

Two more flyovers to come up in Hyderabad soon

అంబర్ పేట ఫ్లై ఓవర్ తో పాటు ఆరామ్‌ఘర్ నుంచి జూ పార్క్ ఫ్లైఓవర్ ను త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయింది. మొదటగా డిసెంబర్ 3న దీన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే దీన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ పొడువు 4.04 కిలోమీటర్లుగా ఉంది. పీవీఆర్ ఎక్స్ ప్రెస్ వే తర్వాత హైదరాబాద్‌లో రెండవ పొడవైన ఫ్లైఓవర్‌గా నిలిచింది.

ఆరు-లేన్లుగా దీన్ని నిర్మించారు. ఇది ఆరామ్‌ఘర్‌ను నెహ్రూ జూలాజికల్ పార్క్‌తో కలుపుతుంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తగ్గనుంది.ఆరామ్‌ఘర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆరామ్ఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివరాంపల్లి, హసన్నగర్ వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తగ్గుతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+