ఉమామహేశ్వరి మృతి వెనక..? మెంటల్ టెన్షన్, ప్రెషరే కారణమా.. ఎల్లుండి అంత్యక్రియలు

ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి కన్నుమూశారు. ఆమె సూసైడ్ చేసుకున్నారని కుటుంబ సభ్యులే చెప్పడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇప్పటికే చంద్రబాబు దంపతులు, లోకేశ్ తదితరులు ఇంటికి వెళ్లారు. అయితే ఉమామహేశ్వరి మృతికి కారణం ఆరోగ్య సమస్యలేనని తెలుస్తోంది.

అనారోగ్యం..

అనారోగ్యం..

ఉమామహేశ్వరి గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం అలముకుంది. ఆమెఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించినట్టు సమాచారం. ఆత్మహత్యకు కారణం ఆమె అనారోగ్యమని కూడా కొందరు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

నలుగురు కూతుళ్లు

నలుగురు కూతుళ్లు


ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి నాలుగవ కుమార్తె అనే సంగతి తెలిసిందే.పెద్ద కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కాగా, రెండవ కుమార్తె చంద్రబాబు భార్య భువనేశ్వరి, మూడవ కుమార్తె లోకేశ్వరి. ఇటీవలే ఉమామహేశ్వరి కుమార్తె వివాహం కూడా జరిగింది. పెద్ద కూతురు అమెరికాలో ఉంటున్నారు. రెండో కూతురు ఇక్కడే ఉంటున్నారు.

 కూతురు వచ్చాకే

కూతురు వచ్చాకే


ఉమామ‌హేశ్వ‌రి చిన్న కూతురు దీక్షిత ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆమె మృత దేహానికి ఉస్మానియా ఆసుప‌త్రిలో శ‌వ ప‌రీక్ష నిర్వ‌హించారు. అనంతరం ఉమామ‌హేశ్వ‌రి మృతదేహాన్ని ఆమె ఇంటికి త‌ర‌లించారు. ఉమామ‌హేశ్వ‌రి పెద్ద కుమార్తె త‌న భ‌ర్త‌తో క‌లిసి అమెరికాలో ఉంటున్నారు. త‌ల్లి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంటనే హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు. పెద్ద కుమార్తె వ‌చ్చాకే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ఆమె కుటుంబం నిర్ణ‌యించింది. ఎల్లుండి ఉమా మ‌హేశ్వ‌రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+