యూపీఐ సర్వర్ డౌన్: నిలిచిన పోన్ పే, గూగుల్ ట్రాన్సాక్షన్స్
ఇప్పుడు అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్.. యూపీఐ ద్వారా పోన్ పే, గూగుల్ పే.. అమెజాన్ పే, పేటీఎం ఉన్నా తక్కువే... ఉదయం లేచినప్పటి నుంచి టీ మొదలు రాత్రి వేసే పెగ్గు వరకు అంతా స్కాన్ చేయాల్సిందే. అసలే సండే.. ఆపై బిజీ సమయంలో యూపీఏ సతాయించింది. అవును పేమెంట్ కాలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన తక్షణ చెల్లింపు వ్యవస్థ యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సర్వర్ నేడు డౌన్ అయ్యింది. దీంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్‌లైన్ పేమెంట్ సేవలు స్తంభించాయి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్లు లావాదేవీలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. యూపీఐ ఆధారంగానే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ వంటి సంస్థలు పని చేస్తాయి. యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో డిజిటల్ వ్యాలెట్, ఆన్‌లైన్ పేమెంట్ సేవలకు ఓ గంట సేపు అంతరాయం కలిగింది.

వినియోగదారులు ఇతర బ్యాంకు ఖాతాలకు తక్షణమే డబ్బు పంపడానికి యుపీఐని ఉపయోగించే గూగుల్ పే, పేటిఎమ్, ఫోన్ పే పనిచేయడం లేదని ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. సమస్యపై ఎన్‌పీసీఐ స్పందించింది. యూపీఐ వ్యవస్థలో కలిగిన సాంకేతిక లోపాన్ని అంగీకరించింది. యూపీఐ ఇప్పుడు మళ్లీ పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవస్థను తాము ఇప్పుడు మరింత తీక్షణంగా పర్యవేక్షిస్తున్నట్టు వెల్లడించింది.
ట్వీట్ చేసిన తర్వాత కూడా కొంతమంది వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ సేవలు నిలిచిపోవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పోస్టు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు మాత్రం దాని యూపీఐ సిస్టమ్ డౌన్ అయినట్లు వివరించింది. మెయింటెనెన్స్ కార్యకలాపాల వల్ల తమ యూపీఐ డౌన్‌లో ఉందని తెలిపింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications