అవీ టీఆర్ఎస్ చేయిస్తోన్న ఆరోపణలే, కౌశిక్ కామెంట్లపై ఉత్తమ్..

కౌశిక్ రెడ్డి ఇష్యూ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఆడియో టేపు కలకలం రేపగా.. కాంగ్రెస్ పార్టీ వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే కౌశిక్ రెడ్డి రాజీనామా కూడా చేశారు. కానీ రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నయం అని వ్యాఖ్యానించారు. దీంతో మాజీ పీసీసీ చీఫ్ రంగంలోకి దిగారు. కౌశిక్ రెడ్డి తీరును తప్పుపట్టారు.

సరికాదు..

సరికాదు..

రేవంత్ రెడ్డి‌, మాణిక్కం ఠాగూర్‌పై కౌశిక్‌ రెడ్డి చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఖండించారు. రేవంత్.. ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవీ పొందారని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. 2018లో హుజురాబాద్ కాంగ్రెస్‌ టికెట్ రావడం వల్లే కౌశిక్‌రెడ్డి లీడర్ అయ్యాడని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. పార్టీలోని ఇతర నేతలను విమర్శించడం సరికాదన్నారు. ఇవీ పక్కాగా టీఆర్ఎస్ నాయకులు చేయిస్తున్న ఆరోపణలని ఆరోపించారు.

బహిష్కరణ..

బహిష్కరణ..

కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించిన్నామని ఉత్తమ్ తెలిపారు. కౌశిక్‌రెడ్డి స్థాయి మరిచిపోయి ఇష్టానుసారం మాట్లాడారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి కౌశిక్ రెడ్డి అలా మాట్లాడారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. అయితే అంతకుముందు కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కొత్త టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ రెడ్డి లక్ష రెట్లు నయమన్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపడంలో ఉత్తమ్ ఉత్తమమని, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రేవంత్ ఫొటోలు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Recommended Video

    Bandi Sanjay, Revanth Reddy, YS Sharmila Padayatras కొత్త బిచ్చగాళ్ళు.. KTR
    యాక్టరా.. ఏంటీ..

    యాక్టరా.. ఏంటీ..


    సినిమా యాక్టర్‌లా రేవంత్ రెడ్డి ఫీల్ అవుతున్నారని కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. టీపీసీసీ చీఫ్ పదవీ వస్తే సీఎం అయిపోయినట్టుగా భావిస్తున్నారని అన్నారు. అదేం కాదని.. సీఎల్పీ నేతను ఎన్నుకొని సీఎం చేస్తారని.. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలు తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారంలోకి వస్తే అలా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు నాయుడికి తెలంగాణ కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఖండించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+