Valentines day 2024: వాలెంటైన్స్ డే నేడే.. ప్రేమికులకు బజరంగ్ దళ్ వార్నింగ్!!
నేడు ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునే వాలెంటైన్స్ డే. అటువంటి వాలెంటైన్స్ డే రోజున తాము ప్రేమించే వారిని స్పెషల్ గా కలుసుకోవాలని, వారికి బహుమానాలు ఇవ్వాలని, ఒకరికొకరు ప్రేమను పంచుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. హైదరాబాద్లో రిసార్ట్స్ ,హోటల్స్, పార్కులు ఎక్కడ చూసినా, ప్రేమ జంటలే కనిపిస్తారు. అటువంటి ప్రేమికుల దినోత్సవం రోజు ఇది విదేశీ సంస్కృతిని, ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించడానికి వీల్లేదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఎక్కడైనా జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని ఇప్పటికే ప్రకటన చేశాయి. నకిలీ ప్రేమను ప్రోత్సహించే వాలెంటైన్స్ డే ను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ హెచ్చరించింది. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దామని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఇప్పటికే ప్రకటన చేశారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించి, విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పోరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు సూచించారు. దేశం కోసం.. ధర్మం కోసం పరితపించేలా ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలన్నారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని.. ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకొని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు.
ప్రేమికుల రోజును అడ్డుకుంటామని, పార్కులు.. హోటళ్లు.. విహార స్థలాలు.. రకరకాల ప్రదేశాల్లో సంచరించే కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పెళ్లి చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రేమ ముసుగులో సాగే తంతును అడ్డుకొని తీరుతామన్నారు. ఇప్పటికే ఈ విషయంలో బజరంగ్ దళ్ విజయం సాధించిందని గుర్తు చేశారు.
ముఖ్యంగా 2019, ఫిబ్రవరి 14 న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. "ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్కరణ దినం" నిర్వహించాలని సూచించారు . ఈ క్రమంలో నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఏం జరగబోతుందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications