Warner Bros: తెలంగాణలో వార్నర్ బ్రదర్స్ పెట్టుబడి.. 1200 మందికి ఉపాధి అవకాశం..
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లోని వైబ్రెంట్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ హబ్‌లోకి ప్రవేశిస్తోంది. ప్రతిపాదిత అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం (IDC) 1200 మంది నిపుణులకు ఉపాధిని కల్పిస్తుంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజల్లో ఒకటిగా ఉంది. ఇది విభిన్న కంటెంట్, బ్రాండ్‌లు ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందింది.
మే 17, 2023న వార్నర్ బ్రదర్స్ డిస్కవరీలో ఫైనాన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్రా కార్టర్‌తో తెలంగాణ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో మంచి భవిష్యత్తు కోసం తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో వృద్ధి, ఆవిష్కరణలను నడపడంలో రెండు పార్టీల భాగస్వామ్యంపై చర్చించారు. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఆకట్టుకునే బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోలో HBO, HBO మ్యాక్స్, CNN, TLC, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, WB, యూరోస్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్‌వర్క్, సినిమాక్స్, పోగో, టూన్ కార్ట్, HGTV మరియు క్వెస్ట్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఛానెళ్లు ఉన్నాయి.

హైదరాబాద్‌లో కార్యాలయాన్ని నెలకొల్పడం ద్వారా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ భారతీయ మార్కెట్‌లోని అపారమైన అవకాశాలను ఉపయోగించుకోవడం, మీడియా, వినోదం మరింత విస్తృత పరచనున్నారు. భారతదేశంలోని వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని IDC వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని ఆ కంపెనీ తెలిపింది.
ఈ కంపెనీ మొదటి సంవత్సరంలో, IDC 1200 మంది నిపుణులను నియమించుకుంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతున్నకొద్ది శ్రామిక శక్తిని మరింత విస్తరించుకోనుంది.












Click it and Unblock the Notifications