Hyderabad: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..!

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) తెలిపింది. ఆసిఫ్‌నగర్ ఫిల్టర్ నుంచి రెడ్ హిల్స్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే కీలకమైన 33 అంగుళాల పైప్‌లైన్ దెబ్బతింది. దీన్ని రిపేయిర్ చేస్తుండడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్ లోని రెడ్ హిల్స్, బజార్‌ఘాట్, మల్లేపల్లి, నాంపల్లి, నీలోఫర్ హాస్పిటల్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఖైరతాబాద్, ఆదర్శనగర్,విజయనగర్ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ ప్రాంతాల్లోని వారు సరిపడా నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు. పైప్ లైన్ మరమ్మతు పనులు జరుగుతున్నాయని, సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పేర్కొంది.

Water supply disruptions to occur in several areas of Hyderabad on December 15th and 16th

దెబ్బతిన్న పైప్‌లైన్ హైదరాబాద్ నీటి సరఫరా నెట్‌వర్క్‌లో కీలకమైనదిగా అధికారులు చెబుతున్నారు. తాగునీటి సరఫరా డిసెంబర్ 17 నాటికి తిరిగి ప్రారంభమవుతుందని వివరించారు. ఈ ఏడాది హైదరాబాద్ లో తాగు నీటి సమస్యలు ఉండకపోవచ్చు. సమృద్ధిగా వర్షాలు కురిశాయి. అటు కృష్ణ ఇటు గోదావరిలో నీటి లభ్యత ఉంది. అంతేకాకుండా గండిపేట, హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. దీంతో నీటి సమస్య ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

అయితే హైదరాబాద్ లో చాలా మంది వినియోగదారులు ఇప్పటికి నల్ల బిల్లులు కట్టలేదు. చాలా వరకు బకాయిలు పేరుకుపోయాయి. బకాయిలు చెల్లించే వారికి వాటర్ బోర్డు రాయితీ కూడా ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+