Rain: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం, పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా.. సాయంత్రం నుంచి చల్లబడిపోయింది. ఇక ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 7.30 గంటల నుంచి వాన దంచికొట్టింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొండాపూర్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, పాతబస్తీ, బహదూర్ పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బండ్లగూడ, బార్కస్, హబ్సిగూడ, రామాంతాపూర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, గాంధీనగర్, బాగ్ లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బోలక్‌పూర్, రాంనగర్, జవహర్‌నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనూ భారీగా వర్షం పడింది. భారీ వర్షంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని రోజులుగా సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. ఉక్కపోతతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాతావరణం చల్లగా మారిపోయింది.
ఇది ఇలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు( ఆగస్టు 27, 28, 29) తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications