హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ఆదేశిస్తే గులాబీ దళంలో చేరిక..? వెంకట్రామిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామి రెడ్డి రాజీనామా.. రాజకీయాల్లోకి రాక అంశాలపై జోరుగా చర్చ జరుగుతుంది. రాజీనామాను వెంటనే ఆమోదించడంతో.. ఆయన మాజీ అయిపోయారు. భవిష్యత్ కార్యచరణ అంశాన్ని సీఎం కేసీఆర్‌కు వదిలేశారు. ఈ క్రమంలో తను ఏంటో తెలుసు అని.. విపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోను అన్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని ప్రకటించారు.

విమర్శలకు నో

విమర్శలకు నో

తనపై విపక్ష పార్టీలు చేసే విమర్శలకు బదులు ఇవ్వనని కుండబద్దలు కొట్టారు. తను ఏంటో తనకు తెలుసు అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్ఎస్‌ వైపు ఆకర్షితుడిని అయ్యానని తెలిపారు. టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నందుకు ఎటువంటి పదవి కూడా ఆశించడం లేదన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి సమయంలో.. ఆయన రాజీనామా చేయడం చర్చగా మారింది.. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఖరారు అయ్యిందని.. అందుకే ఐఏఎస్‌గా రాజీనామా చేశారనే చర్చ కూడా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

రాజీనామా.. ఆమోదం

రాజీనామా.. ఆమోదం


అంతకుముందు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేశారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు రాజీనామా లేఖ అందించారు. వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీనామా ఆమోదం అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాలో మాట్లాడుతూ.. త్వరలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్‌ తెలంగాణను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఈ అభివృద్ధి మార్గంలో సీఎంతో ఉండాలనుకొని వీఆర్‌ఎస్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. వంద సంవత్సరాలు తెలంగాణ గురించి ప్రజలు చెప్పుకొనే విధంగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. సీఎం మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తానని పేర్కొన్నారు.

ఆయన పేరు ఖరారు

ఆయన పేరు ఖరారు


ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటీలో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కేసీఆర్‌కు అత్యంత విధేయుడైన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే లేదా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రేపటితో ముగియనుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

Recommended Video

AP Cabinet : APలో కేబినెట్ విస్తరణ.. ప్రశాంత్ కిషోర్ మంత్రాంగం..!! || Oneindia Telugu
ఇదీ షెడ్యూల్

ఇదీ షెడ్యూల్

తెలంగాణలో 19 ఎమ్మెల్సీ స్థాన్థాలకు నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల నుంచి 12, ఎమ్మెల్యే కోటాలో 6, గవర్నర్ కోటా నుంచి ఒకస్థానం భర్తీ చేయాల్సి ఉంది. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ వెలువడింది. రేపటితో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. 17వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చేనెల 22 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 29న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 23వ తేదీన నామినేషన్లకు చివరి తేదీగా పేర్కొన్నారు.

English summary
when cm kcr call, will join trs party ex ias venkat rami reddy said to media. he resign ias post than cs approved that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X