Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Venkatesh: డెక్కన్ కిచెన్ హోటల్ కథేంటి.. వెంకటేష్‍పై కేసు ఎందుకు..!

డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఘటనలో హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, హీరో రానాపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. అయితే డెక్కన్ కిచెన్ హెటల్ కథ ఏమిటో తెలుసుకుందాం. దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ కు జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని రోడ్ నెం. 1లో ప్లాట్ నెం 2 మరియు 3 (డి.నెం.8-2-293/82/F/A/3) స్థలం ఉంది. ఈ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యక్తికి లీజ్ కు ఇచ్చారు. ప్రమోద్ కుమార్ స్నేహితుడు నంద కుమార్ కలిసి ఆ స్థలంలో హోటల్ పెట్టారు.

అయితే ఆ హోటల్ ను వీరు ఈ హోటల్ ను సబ్ లీజ్ కు ఇచ్చినట్లు సమాచారం. మహీంద్రా హిల్స్‌కు చెందిన సయ్యద్ అయాజ్, అతని సోదరుడు సయ్యద్ అజర్‌కు సబి లీజ్ కు ఇచ్చారు. రూ. 12 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని మొత్తం అమ్మకాలపై 10% కమీషన్ చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. వీరు 2011 నుంచి డెక్కన్ కిచెన్‌ హోటల్ నడుపుతున్నారు. ఆ స్థలంలో ఐదు వాణిజ్య ప్రాపర్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. డక్కన్ కిచెన్, స్క్రీమ్ - ఒక ఐస్ క్రీమ్ పార్లర్, బారిస్టా, గౌర్మెట్, గాడ్జెట్ స్టోర్‌ల ఏర్పాటు చేశారు.

Why was a case registered against Venkatesh in connection with the demolition of Deccan Kitchen Hotel

అయితే ఒప్పందం ప్రకారం ఆ స్థలంలో కొత్త కట్టడాలు, సబ్ లీజ్ కు ఇవ్వడానికి అనుమతి లేదు. యజమానుల అనుమతితోనే ఏదైనా చేయాలి. కానీ స్థలాన్ని సబ్ లీజ్ కు ఇవ్వడంతో దగ్గుబాటి సోదరులు కోర్టును ఆశ్రయించారు. అయితే నందకుమార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ తర్వాత అతను ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాత డెక్కన్ కిచెన్ హోటల్ ను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన నందకుమార్ దీనిపై కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా నందకుమార్ దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేశ్, రానాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హోటల్ కూల్చివేత పై వీరిపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉన్నా.. వెంటటేశ్, సురేష్ బాబు, రానా, జీహెచ్ఎంసీ డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. నందకుమార్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు సురేష్ బాబు, వెంకటేశ్, రానాపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+