ప్రేమోన్మాది ఘాతుకం: కాలేజీకి వెళ్తుంటే కొబ్బరిబొండాల కత్తితో నరికాడు, ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్: బర్కత్‌పురాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో ఓ యువతిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. యువతి తల, పొట్ట, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బర్కత్‌పురాలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యానగర్‌లో జరిగింది.
నిందితుడి పేరు భరత్. బాధితురాలి పేరు మధులిక. ఆమె ఇంటర్ చదువుతోంది. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో అతను బాధితురాలి వెంట పడుతున్నాడు. దాడి అనంతరం భరత్ పరారయ్యాడు. బాధితురాలు భరత్ పైన గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు.

భరత్, మధులికలు సత్యానగర్‌లో పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. ప్రేమిస్తున్నానంటూ గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు.
ఈ క్రమంలో యువతి బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లే సమయంలో కొబ్బరి బొండాల కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. భరత్‌పై వేధింపుల కేసు పెట్టినందునే ఈ దారుణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. భరత్ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదన్నారు.
మధులిక అరుపులు విని పరుగులు పెట్టామని ఆమె అక్క మౌనిక, పిన్ని రాజేశ్వరి తెలిపారు. మధులికను కత్తితో నరుకుతుంటే ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదని చెప్పారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications