వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త:ఆదాయం తక్కువ ఉంటే పన్ను ఆదా, మారిన రూల్స్ ఇవే

ఏప్రిల్ మాసం నుండి ఆదాయపు పన్ను చట్టాలు మారనున్నాయి. ఈ మేరకు ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కొత్త ఆర్థిక బిల్లుకు సవరణలను కూడ లోక్ సభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1వ, తేది నుండి కొత్త

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఏప్రిల్ మాసం నుండి ఆదాయపు పన్ను చట్టాలు మారనున్నాయి. ఈ మేరకు ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కొత్త ఆర్థిక బిల్లుకు సవరణలను కూడ లోక్ సభ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఏప్రిల్ 1వ, తేది నుండి కొత్త ఆదాయపు పన్ను శాఖ రూల్స్ రానున్నాయి.

నల్లధనం నిర్మూలించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక బిల్లును తెచ్చింది.2017-18 ఆర్థిక బిల్లుకు బుదవారం నాడు లోక్ సభ ఆమోదం తెలిపింది.

10 income tax rules that will Change from april 2017

రెండున్నర లక్షలు, రూ, ఐదు లక్షల మధ్య ఆధాయం ఉన్నవారికి పన్ను శాతం తగ్గనుంది. అలాగే మొత్తం ఆదాయం కోటి రూపాయాల లోపు ఉంటే, ఆదాయపు పన్ను పది శాతం నుండి ఐదు శాతానికి తగ్గనుంది. దీంతో ఏడాదికి రూ.12,500 తగ్గే అవకాశం ఉంది.

మూడున్నరలక్షల ఆదాయం ఉన్నవారు రూ.7700,రూ.ఐదున్నర లక్షల ఆదాయం ఉన్నవారికి రూ,12,900 ఆదా కానున్నాయి.87 ఎ సెక్షన్ ప్రకారంగా ఈ తగ్గింపు లభిస్తోంది.అయితే మూడున్నర లక్షల ఆదాయ పన్ను చెల్లించేవారికి మాత్రం ఈ రిబేట్ వర్తించదని కొత్త నిబంధనలు చెబుతున్నాయి.

ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి వన్ పేజీ పాం ను కొత్తగా పరిచయం ేయనున్నారు. అంటే ఐదు లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు సులభమైన ఒకే పేజీతో ఆదాయపు పన్నును చెల్లించే అవకాశం కల్పించింది.ఈ విభాగంలో మొదటిసారిగా దాఖలు చేసే పన్ను రిటర్న్ లపై సహజంగా స్క్యూట్నీ ఉండదు.

నేషనల్ పెన్షన్ స్కీం విత్ డ్రా లపై ఎలాంటి పన్ను ఉండదు. ఖాతాదారులకు 25 శాతం అత్యవసరాల కోసం విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే రిటైర్ మెంట్ తర్వాత విత్ డ్రాలపై వచ్చే మొత్తంగా 40 శాతానికి ఎలాంటి టాక్స్ ఉండదు.

English summary
union finance minister Arun Jaitley had announced a number of income tax changes in Budget 2017. In addition, some amendments were also introduced in the finance bill that was passed by the lok sabha. here are some of the changes that income tax payers should note.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X