చెత్త కుప్పలో రూ.10 లక్షలు దొరికాయి.. ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఏం చేసిందో తెలుసా..?
రోడ్డుపై చెత్తను శుభ్రం చేసే సాధారణ పారిశుద్ధ్య కార్మికురాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. సాధారణంగా ఎవరైనా రోడ్డుపై వెళ్తున్నప్పుడు పది రూపాయలు దొరికితే వెంటనే వాటిని తీసుకుంటారు. అక్కడ ఎవరూ లేకపోతే తీసుకుని వెళ్తారు. ఇలాంటివి మనం చాలా చూస్తుంటాం. అయితే ముంబైకు చెందిన ఈ పారిశుద్ధ్య కార్మికురాలు మాత్రం తన నిజాయితీని చాటుకుని అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఆమె మంచి మనసుకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ రోజుల్లోనూ ఇలాంటి వాళ్లు ఉన్నారా..? అని షాక్ అవుతున్నారు. కళ్లముందు అంత డబ్బు కనబడుతున్నా ఆమె వ్యవహరించిన తీరు అందరి చేతా ప్రశంసలు కురిపిస్తోంది.
ముంబైలోని పుణె, సదాశివ్ పేఠ్ కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు చాటుకున్నారు. రోజూలాగే గురువారం కూడా సదాశివ్ పేఠ్ పరిసరాల్లోని రోడ్ల పక్కన చెత్తను ఊడ్చుతుండగా ఆమెకు ఓ బ్యాగ్ కనిపించింది. అయితే బ్యాగ్ ను ఓపెన్ చేశారు అంజు మనే. అందులో రూ. 10 లక్షల రూపాయలు, మెడిసిన్స్ కనిపించాయి. బ్యాగ్ ను ఎవరో పోగొట్టుకున్నారు అని భావించిన అంజు మనే.. వారి కోసం ఆ గల్లీలు మొత్తం తిరిగారు. అయితే ఇంతలో ఓ వ్యక్తి ఎంతో ఆందోళనగా కనిపించడం చూశారు. టెన్షన్ లో ఉన్న అతనికి మంచినీళ్లు ఇచ్చి ఏం జరిగిందని అడిగారు. అతడు జరిగిన విషయం చెప్పడంతో .. బ్యాగు అతడిదేనని నిర్ధారించుకున్న అంజు మనే.. వెంటనే ఆ బ్యాగ్ ను అతడికి అందించారు. ఆ బ్యాగులో రూ. 10 లక్షలు నగదు, మెడిసిన్లు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే గొప్ప మనసు, నిజాయితీ తెలుసుకున్న ఆ బ్యాగ్ యజమాని ఆమెకు ఓ చీర, కొంత డబ్బు ఇచ్చి గౌరవించారు.

ఇదే విషయంపై అంజు మనే మాట్లాడుతూ.. తాను చాలా సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో చెత్తను సేకరిస్తున్నానని.. తనకు ఈ ఏరియాలోని వాళ్లంతా తెలుసని తెలిపారు. వాళ్లు ఏది పొగొట్టుకున్నా అడిగి ఇస్తానన్నారు. అయితే రోజూలాగే గురువారం కూడా చెత్తను సేకరిస్తుండగా.. రోడ్డు పక్కన చెత్తకుప్పలో ఓ బ్యాగు కనిపించింది.. ఓపెన్ చేస్తే రూ. 10 లక్షలు నగదు ఉంది. దాంతో కాలనీలు అన్నీ తిరిగాను. ఇంతలో ఓ వ్యక్తి టెన్షన్ పడుతూ.. ఏదో వెతుకుతూ కనిపించాడు. అతడికి నీళ్లు ఇచ్చి విషయం గురించి తెలుసుకున్నాను. బ్యాగ్ అతనిదేనని నిర్ధారించుకుని.. అతడికి అప్పజెప్పాను.. అని అంజు మనే చెప్పుకొచ్చారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications