మైనర్ బాలికపై అఘాయిత్యం : హర్యానాలో ఘటన
అంబాలా : దేశంలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. రోజుకోచోట .. ఎవరో ఒకరు మృగాళ్ల చేతిలో లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. కొందరు కీచకులు మైనర్లను కూడా వదలడం లేదు. నయనో, భయానో బెదిరించి ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. హర్యానాలోని అంబాలాలో బుధవారం ముగ్గురు యువకులు మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కత్తితో బెదిరించి మద్యం తాగించారు. ఆకృత్యానికి ఒడిగట్టారు. తెల్లవారుజామున మెలకువై లేచిన బాలిక .. వారికి తెలియకుండా అక్కడినుంచి ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరింది.

మార్కెట్ కు వెళ్తుండగా ...
హర్యానాలోని అంబాలాకు చెందిన 13 ఏళ్ల బాలిక మార్కెట్‌కు వెళ్లేందుకు ఇంటి నంచి బయటకొచ్చింది. ఇంతలో ఒకతను బాలికను బలవంతగా నిర్జీవ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున ఎలాగోలా వారికి తెలియకుండా తప్పించుకొని ఇంటికొచ్చింది. ఇంట్లో తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో వారు ఆ యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిందున పోస్కో కింద ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మద్యం తాగించి ..
బాలికపై అక్కడికి తీసుకెళ్లాక బలవంతంగా మద్యం తాగించారని పోలీసులు తెలిపారు. మెడపై కత్తిపెట్టి తాగించారని .. తప్పక తాగడంతో స్పృహ కోల్పోయిందని వివరించారు. మత్తులోనే దారుణానికి ఒడిగట్టారని .. అయితే మత్తు దిగాక వారి బరి నుంచి బాలిక తప్పించుకొని ఇంటికొచ్చింది. ఆ బాలికకు పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలను చార్జీషీట్ లో ప్రస్తావించి .. నిందితులకు కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications