TMC రెబెల్ ఎంపీల బిగ్ స్కెచ్..! త్వరలో బీజేపీలోకి జంప్..!
ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఘోర పరాజయం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన 21 మంది ఎంపీలు రెబెల్స్ గా మారారు. బీజేపీలోకి వెళ్లేందుకు వీలుగా ఆ పార్టీతో చర్చలు జరిపారు. ఆలోపే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. చివరికి బీజేపీలో (BJP) చేరకుండా త్రిపురకు చెందిన చిన్న పార్టీ ఎన్సీపీఐలో (NCPI) చేరిపోయారు. ఈ అనూహ్య పరిణామం దేశంలో రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ టీఎంసీ రెబెల్స్ వ్యూహాలు గమనిస్తే.. అప్పట్లో వారు చేసిన పని ఆషామాషీ కాదని తేలిపోయింది.
అప్పట్లో టీఎంసీ నుంచి 21 మంది రెబెల్ ఎంపీలు సీనియర్ మహిళా నేత కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఎన్సీపీఐలో చేరారు. తద్వారా తమపై అనర్హత వేటు పడకుండా తాత్కాలికంగా తప్పించుకున్నట్లు కనిపించారు. కానీ ఇలా చేరడం కూడా ఫిరాయింపు కిందకే వస్తుందని టీఎంసీ అప్పటి నుంచీ కోర్టుల్లో పోరాడుతోంది. అదే సమయంలో వీరి అసలు ప్లాన్ అయిన బీజేపీలో చేరికను బయటకు తీస్తున్నారు. త్వరలో దుర్గాపూజకు ముందే తాము బీజేపీలో చేరబోతున్నట్లు ఈ రెబెల్స్ లో ఒకరైన జగదీష్ చంద్ర వర్మ ప్రకటించారు. దీంతో టీఎంసీ రెబెల్స్ అసలు ప్లాన్ అందరికీ అర్థమవుతోంది. ఇలా రెండు పార్టీలో మారితే అనర్హత వేటు పడకపోవచ్చనేది వీరి అంచనాగా తెలుస్తోంది.

జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం, తిరుగుబాటు ఎంపీలు అందరూ కలిసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇలా చేయడం వల్ల 'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం' కింద తమ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉండదని వారు భావిస్తున్నారు. మొత్తం 17 మంది ఎంపీలం కలిసి బీజేపీలో చేరుతున్నామని ఆయన తెలిపారు. అప్పుడు ఎన్సీపీఐలో చేరిన మొత్తం 20 మంది సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది పార్టీ మారుతుండటంతో, తమపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని అని ఆయన 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా'కు వెల్లడించారు. వీరిలో ముగ్గురు ముస్లిం ఎంపీలు మాత్రం బీజేపీలో చేరడం లేదు.













Click it and Unblock the Notifications
