విదేశాల నుంచి తమిళనాడుకు- 18 మంది కోవిడ్ పాజిటివ్ : జీనోమ్ పరీక్షకు నమూనాలు..!!

ఓమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న సమయంలో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు ముందస్తు చర్యల పైన లేఖలు రాసింది. ఇదే క్రమంలో అన్ని విమానాశ్రయాల దగ్గర ఇతర దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరి చేసింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 32 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇక, తాజాగా విదేశాల నుంచి తమిళనాడు వచ్చిన 18 మందిలో కోవిడ్ పాజిటివ్ లక్షణాలను గుర్తిం చారు. దీంతో..వారి నమూనాలను జెనోమిక్ సీక్వెన్సింగ్ విశ్లేషణ కోసం పంపారు. వారిలో డెల్టా పాజిటివ్ లక్షణాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది.

18 మంది నమూనాలు పరీక్ష కోసం

18 మంది నమూనాలు పరీక్ష కోసం

చెన్నై నగరంలో మాసివ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వైరస్ గుర్తించిన 18 మందిలో చెన్నైలోని గిండీలోని కరోనావైరస్ ఆసుపత్రిలో తొమ్మిది మంది, తిరుచిరాపల్లిలోని అన్నై మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు, నాగర్‌కోయిల్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇద్దరు మరియు బెంగళూరులో ఒకరు ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌కు 94.15 లక్షల మంది అర్హత సాధించారని, ప్రపంచ స్థాయిలో డెల్టా వేరియంట్‌ ప్రభావం తగ్గలేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె రాధాకృష్ణన్‌ తెలిపారు.

తమిళనాడులో ఓమిక్రాన్ నిర్దారణ కాలేదు

తమిళనాడులో ఓమిక్రాన్ నిర్దారణ కాలేదు

ప్రపంచ స్థాయిలో, వైరస్ యొక్క డెల్టా వేరియంట్ ప్రభావం రష్యా, ఆస్ట్రియా, ఉక్రెయిన్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ఎక్కువగా ఉందని.. అదే సమయంలో ఓమిక్రాన్ వేరియంట్ 50కి పైగా దేశాలలో వ్యాపిస్తోందని వివరించారు. తమిళనాడులో ఓమిక్రాన్ వేరియంట్ గుర్తించలేదని..అది గుడ్ న్యూస్ గా పేర్కొన్నారు. మాస్కులు ధరించటం.. సామాజిక దూరం పాటించటం... టీకాలు తీసుకోవటం ద్వారా వైరస్ నియంత్రణకు సహకరించాలని సూచించారు.

టీకా ప్రక్రియ వేగవంతం

టీకా ప్రక్రియ వేగవంతం

ప్రజలంతా టీకాలు తీసుకోవటంతో పాటుగా కోవిడ్ -19 ప్రోటోకాల్ ను అనుసరించాలని ప్రభుత్వం పదే పదే సూచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న 600 కేసుల ఇన్‌ఫెక్షన్ రేటును మరింత తగ్గించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైరస్ మాత్రం ఇప్పటికీ ప్రబలంగా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి దాకా 7.54 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకోగా.. అందులో 81.30 శాతం మంది తొలి డోస్ తీసుకోగా..48.95 శాతం మంది రెండో డోసు తీసుకున్నట్లుగా మంత్రి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+