1972 నాటి కరువు దాపురించింది.. పంట ఎండిపోయింది.

ఎల్ నినో దెబ్బకి రైతాంగానికి మళ్లీ కష్టాలొచ్చాయి. ఈ ఏడాది వర్షాలు ముఖం చాటేయడంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు దాపురించాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పుసద్ తహసీల్ ప్రాంతంలో కరువు రాక్షసి తన కోరలు చాచింది. ఎకరాలకు ఎకరాలు విత్తుకున్న పత్తి, సోయాబీన్ పంటలు పొలాల్లోనే ఎండిపోయి కళ్లముందే మాడిపోతున్నాయి.

అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా మట్టిపాలవ్వడంతో రైతన్నలు ఆవేదనతో రగిలిపోతున్నారు. సాధారణంగా శీతాకాలంలో కనిపించే కరువు పరిస్థితులు.. ఈసారి సెప్టెంబర్ నెలలోనే తీవ్రరూపం దాల్చడంతో భవిష్యత్తు ఎటు పోతుందోనని యావత్ గ్రామీణ ప్రాంతం వణికిపోతోంది. ఐదు దశాబ్దాల క్రితం 1972లో వచ్చిన భయంకరమైన కరువు రోజులను ఈ నాటి పరిస్థితులు గుర్తుచేస్తున్నాయని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

1972 Drought Memories Revived in Yavatmal Massive Crop Losses Leave Farmers in Deep Distress

మూడేళ్లుగా తుడిచిపెట్టుకుపోతున్న ఆశలు

గత మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు తమను వదలడం లేదని, ఊపిరి ఆడకుండా చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టితో పంటలన్నీ తుడుచుపెట్టుకుపోయాయి. "ఎకరా సోయాబీన్ వేయడానికి రూ. 20,000 నుంచి రూ. 25,000 వరకు ఖర్చు చేశాం. తీరా చూస్తే కనీసం కిలో ధాన్యం కూడా చేతికి వచ్చేలా లేదు. కనీసం విత్తనాల ఖర్చు కూడా వెనక్కి రాని పరిస్థితి. ఇక పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పశువుల పోషణ ఎలా నడపాలి?" అని స్థానిక రైతు దుర్గాదాస్ రాథోడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనీష్ జాధవ్ అనే మరో రైతు మాట్లాడుతూ.. ఎకరానికి రూ. 1 లక్ష వరకు ఎటువంటి షరతులు లేకుండా తక్షణ నష్టపరిహారంతో పాటు పంట భీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

El Nino: 2009 నాటి ఘోర పరిస్థితి తర్వాత.. 17 ఏళ్లకు మళ్లీ అదే సీన్!
El Nino: 2009 నాటి ఘోర పరిస్థితి తర్వాత.. 17 ఏళ్లకు మళ్లీ అదే సీన్!

వలస బాట పడుతున్న పల్లెలు

కరువు ప్రభావం కేవలం రైతులపైనే కాదు, వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కూలీల జీవితాలపైనా దెబ్బకొట్టింది. పొలాల్లో పని దొరక్కపోవడంతో గ్రామాల్లో ఉపాధి కరువైంది. దాంతో పొట్టకూటి కోసం యవత్మాల్ పల్లెల నుంచి కుటుంబాలకు కుటుంబాలు పూణే, ముంబై, పశ్చిమ మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాలకు వలస బాట పడుతున్నాయి. త్వరలోనే పశువులకు గడ్డి, తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.

కుంభకర్ణ నిద్రలో యంత్రాంగం!

రైతాంగం ఇంతటి దారుణమైన సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక రైతు ఆదిత్య జాధవ్ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం కుంభకర్ణ నిద్రపోతోందని, వారిని నిద్రలేపి రైతుల గోడు వినిపించడం సాధ్యం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకటనలు, హామీలతో సరిపెట్టకుండా వెంటనే క్షేత్రస్థాయికి వచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

El Nino: కరువు వచ్చేసిందా? 78.3 శాతం వర్షభావంతో టాప్
El Nino: కరువు వచ్చేసిందా? 78.3 శాతం వర్షభావంతో టాప్

ప్రభుత్వం వేగంగా స్పందించాలి!

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కరువు సహాయక చర్యల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. బుధవారం నుంచే క్షేత్రస్థాయిలో పంట నష్టాల అంచనా ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఇచ్చే నిధుల కోసం వేచి చూడకుండా, రాష్ట్ర నిధుల నుంచే తక్షణ సహాయం అందిస్తామని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడు-ఎనిమిది నెలల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+