• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్‌లో 90ల నాటి పరిస్థితులను తలపిస్తోన్న పరిణామాలు

|

కశ్మీర్ : జరుగుతోన్న పరిణామాలు చూస్తేంటే.. కశ్మీర్ లో మళ్లీ 90ల నాటి పరిస్థితులు నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. అప్పట్లో స్కూల్స్, కాలేజీలే లక్ష్యంగా తమ దాడులను కొనసాగించిన లష్కరే తోయిబా ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరిస్తోంది. హురియత్ కాన్ఫరెన్స్ క్యాలెండర్ ఆదేశాలను బేఖాతరు చేసే స్కూల్స్, కాలేజీలే టార్గెట్ గా దాడులు జరుగుతూ వస్తున్నాయి.

గత జూలై9న బుర్హానవనీ ఎన్ కౌంటర్ జరిగిన నాటి నుంచి కశ్మీర్ ఉద్రిక్తలతో అట్టుడుకుతూనే ఉంది. ఇక ఆరోజు మొదలు నేటి దాకా కశ్మీర్ లోని పలు స్కూల్స్, కాలేజీలు తీవ్రవాదుల దాడుకు గురవుతూ వస్తున్నాయి.

గత జూలై నుంచి నేటివరకు 23 స్కూల్స్ దహనం :

*గడిచిన మూడున్నర నెలలుగా కశ్మీర్ లో నిరంతరం నిరసన సెగలు రగులుతూనే ఉండడంతో.. కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 10జిల్లాల్లో ప్రతీరోజు ఎక్కడో ఓ చోట ఓ స్కూల్ తగలబడిపోతూనే ఉంది.

1990s are back in J&K as terrorists go on rampage targeting schools

* గడిచిన నాలుగు రోజుల్లోనే ఐదు స్కూల్స్ దహనమయ్యాయి.

* స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ బోర్డు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కశ్మీర్ లో ఉద్రిక్తల నేపథ్యంలో.. 17 ప్రాథమిక, మరియు సెకండరీ స్కూల్స్ దహనమయ్యాయి. వీటికి సంబంధించిన కారణాలు మిస్టరీగానే మిగిలిపోయాయి.

* కశ్మీర్ లో పేరొందిన రెండు ప్రముఖ ప్రైవేటు స్కూల్స్ కూడా మంటల్లో దాటికి దెబ్బతిన్నాయి.

* కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తోన్న ఓ హైస్కూల్ మరియు చారిత్రక హన్ఫియా స్కూల్ వీటి బారినపడ్డాయి.

* కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో పాటు ఆమె తండ్రి దివంగత మాజీ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయిద్ మరియు ఎన్సీ మీర్జా అఫ్జల్ బేగ్.. వీరంతా వక్ఫ్ బోర్డు ఇనిస్టిట్యూట్ లో చదివిన పూర్వ విద్యార్థులు కావడం గమనార్హం.

* దహనకాండ సాగించిన 17 స్కూల్స్ లో 10 స్కూల్స్ పాక్షికంగా దహనం కాగా, మరో ఏడు స్కూల్స్ బూడిద కాకుండా నియంత్రించగలిగారు.

* పూర్తిగా కాలిపోయిన స్కూల్స్ లో దక్షిణ కశ్మీర్ లోని కుల్గమ్ ఒకటి. పూర్తిగా కాలిపోయిన ఐదు స్కూల్స్ లో ఈ స్కూల్ ది మరీ అధ్వాన్న పరిస్థితి.

* కశ్మీర్ లోని బుడ్గాం జిల్లాలోను మూడు స్కూల్స్ ను దహనం చేసే ప్రయత్నం చేశారు.

* స్కూల్స్ కాలేజీలకు సంబంధించిన దహనకాండలన్నింటిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇంతవరకు ఒక్కరిని పోలీసులు అరెస్టు చేయకపోవడం గమనార్హం.

1990 నాటి రోజులు మళ్లీ వచ్చాయా?

* 1990లలో దాదాపు 5000 స్కూల్స్ ను మిలిటెంట్లు తగలబెట్టారు. దీంతో స్కూల్స్ కు వెళ్లి చదువుకోవడమనేది ఆరోజుల్లో కష్టసాధ్యంగా మారింది. చాలా స్కూల్స్ లో టీచర్స్ ను విద్యార్థులను బలవంతాన బయటకి నెట్టి మరీ భవనాలను తగలబెట్టారు.

* ఆ తర్వాత తగలబడిపోయిన ఆ స్కూల్స్ ను తిరిగి మళ్లీ నిర్మించడానికి చాలా ఏళ్లు పట్టింది. ఇక ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే.. ఆ స్కూల్స్ నిర్మాణ కోసం అక్కడి ప్రజలు పడిన శ్రమ అంతా మళ్లీ వ్రుథా అయిపోయే పరిస్థితి తలెత్తింది.

* మే10,1989న లాల్ చౌక్, శ్రీనగర్ లో జరిగిన భారీ పేలుడు దాటికి సమీపంలోని బిస్కో మెమెరియల్ స్కూల్ పూర్తిగా ధ్వంసమైపోయింది.

* మార్చి17,1990 సోనావర్ లో ఓ క్యాథలిక్ మిషన్ స్కూల్ ను దహనం చేయడానికి విఫల ప్రయత్నం జరిగింది.

* మే23,1990 లాల్ చౌక్ లోని బిస్కో మెమోరియల్ స్కూల్ ను తగలబెట్టిన సమయంలో... విద్యార్థులకు తప్పనిసరిగా అరబిక్ తో పాటు ఇస్లామిక్ పాఠాలు నేర్పించాలంటూ.. అక్కడి స్కూల్ టీచర్స్ తో గుర్తు తెలియని తీవ్రవాదులు వాగ్వాదానికి దిగారు.

*నవంబర్ 11,1990 లాల్ చౌక్, శ్రీనగర్ లోనే జరిగిన మరో బాంబు పేలుడు దాటికి బిస్కో స్కూల్ పరిసర ప్రాంతాలు ధ్వంసమైపోయాయి.

*ఫిబ్రవరి 23, 1991 లాల్ చౌక్, శ్రీనగర్ లో మిస్ మెలన్సాన్ గర్ల్స్ స్కూల్ సమీపంలో మరో పేలుడు చోటు చేసుకుంది.

*జూలై5,1992 లాల్ చౌక్, శ్రీనగర్ లో బిస్కో మెమోరియల్ స్కూల్ సమీపంలో మరో పేలుడు చోటు చేసుకుంది

*జూలై 24,1993 లాల్ చౌక్ శ్రీనగర్ లో మరోసారి తీవ్రవాదులు బిస్కో స్కూల్ ను దహనం చేయడానికి ప్రయత్నించారు.

English summary
The last time Kashmir witnessed such a scenario was in 1990s when militancy was at its peak. A breakdown of the number of schools targeted during the unrest which began on July 9 will give a clear indication of how bad the scenario is today
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X