తప్పతాగి బార్ గర్ల్స్ తో పోలీసుల చిందులు.. దెబ్బకు సస్పెండ్
పాట్నా : బీహార్ లోని భోజ్ పూర్ లో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో స్థానిక పోలీసులు ముగ్గురు పీకలదాకా తాగి బార్ గర్ల్స్ తో ఒళ్లు తెలియకుండా చిందులేశారు. ఈ వీడియో కాస్త బుధవారం నాడు ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో విషయాన్ని సీరియస్ గా పరిగణించిన పాట్నా జోనల్ ఐజీ నయ్యర్ హుసేన్ ఖాన్ ఆ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సస్పెండ్ అయిన ముగ్గురిలో ఓ ఎస్.హెచ్ఓ (స్టేషన్ హౌజ్ ఆఫీసర్) శంకర్ తో పాటు ఏఎస్సై దేవచంద్ర సింగ్, కానిస్టేబుల్ భూషణ్ ఉన్నారు. వీరంతా భోజ్ పూర్ జిల్లాలోని కోయిల్వార్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, ముగ్గురు కలిసి ఓ ప్రైవేటు ఫంక్షన్ కు హాజరైన సందర్బంలో అక్కడ బార్ గర్ల్స్ తో డ్యాన్సులు చేయడం.. అది కాస్త ఇంటర్నెట్ లోకి ఎక్కడంతో.. విషయం వివాదస్పదంగా మారింది.

వీడియో ఫుటేజీని పరిశీలించిన అనంతరం ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు ఐజీ. ఇదిలా ఉంటే విజయదశమి సందర్బంగా కోయిల్వార్ లోని స్థానిక పూజ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ప్రైవేట్ ఫంక్షన్ జరిగినట్లుగా తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications