కోతి అంత్యక్రియలకు 4 వేల మంది హాజరు.. హనుమాన్ అవతారంగా భావించి.. ఎక్కడంటే..?
పురాణాల్లో కోతిని హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తుంటారు. అయితే మధ్య ప్రదేశ్ లో వింత ఘటన జరిగింది. మృతి చెందిన ఓ కోతికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు ఆ గ్రామస్థులు.. మనిషికి ఎలాగైతే నిర్వహిస్తారో అలాగో ఆ వానరం అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహించారు. వానరాన్ని కడసారి వీడ్కోలు పలికేందుకు ఊరు ఊరంతా కదిలింది. దాదాపు 4 వేల మందికిపైగా గ్రామస్థాలు వానరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే కోతి అస్థికలను ఉజ్జయిని షిప్రా నదిలో నిమజ్జనం చేశారు. దశదినకర్మ రోజున రూ. లక్ష విరాళాలతో 4 వేల మందికి భోజనం ఏర్పాటు చేశారు. 2022 లోనూ ఇదే జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది.
వానరాన్ని హనుమాన్ ప్రతి రూపంగా ప్రజలు భావిస్తుంటారు. అయితే ఇటీవల మధ్య ప్రదేశ్ లోని రాజ్ ఘఢ్ జిల్లా ధారావారి గ్రామంలో ఓ వానరం మృతి చెందింది. కోతి కరెంట్ షాకుతో మృతి చెందింది. అయితే కోతిని హనుమాన్ ప్రతిరూపంగా భావించిన ఆ గ్రామస్థులు.. తమ ఇంట్లో కుటుంబ సభ్యులు మృతి చెందితే ఎలాగైతే అంత్యక్రియలు నిర్వహిస్తారో అలాగే వానరానికి సైతం చేశారు. ధారావారిలోని దాదాపు 4 వేల మందికి పైగా గ్రామస్థులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
డబ్బు చప్పుళ్లతో కోతి మృతదేహాన్ని ఊరేగింపుగా శాంతి ఘాట్ కు తీసుకెళ్లారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో కోతికి అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే 11 రోజుల తర్వాత దశదినకర్మ కూడా ఘనంగా చేశారు. గ్రామానికి చెందిన పటేల్ భీరామ్ సింగ్ సోందియా.. స్థానికులతో కలిసి కోతి అస్థికలను ఉజ్జయిని షిప్రా నదిలో నిమజ్జనం చేశారు. ఆ తర్వాత రూ.1 లక్ష విరాళాలు సేకరించి 4 వేల మందికిపైగా ప్రజలు భోజనాలు ఏర్పాటు చేశారు. 5 క్వింటాల పూరీలు, 40 కేజీల సేవ్, 100 లీటర్ల మజ్జిగతో కూరలు చేశారు. ఈ భోజనాలకు సుమారు 30-35 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు హాజరయ్యారు.

2021 లోనూ ఈ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. దాలుపురా గ్రామంలో ఓ కోతి అనారోగ్య కారణాలతో మృతి చెందింది. దీంతో ఆ కోతిని ఊరంతా ఘనంగా అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. దాదాపు 1500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications