మాంసాహారంలో 40 బొద్దింకలు..! 15రోజుల పాటు రెస్టారెంట్ బంద్..!!

Recommended Video

    OMG ! 40 Cockroaches In A Food Parsil,That Delivery Shope Closed For 15 Days | Oneindia Telugu

    హైద‌రాబాద్ : ఆక‌లికి రుచి తెలియ‌దు..! నిద్ర‌కు సుఖ‌మెర‌గ‌దు అనే సామెత ఊరిక‌నే రాలేదు. ఆక‌లిగా ఉన్న‌వాడికి ఏది పెట్టినా ఎలా ఉంద‌ని చూడ‌కుండా లాగించేస్తాడు. దాని రుచి తెలియ‌కుండానే పొట్ట నిండా ఆర‌గించేస్తాడు. కాస్త ఆక‌లి తీరిన త‌ర్వాత గాని తెలియ‌దు ఆ వ్య‌క్తి తీసుకున్న ఆహారం ఏంటి, దాద‌ని రుచి ఎలా ఉంద‌ని. స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే ద‌క్షిణ చైనాలో చోటు చేసుకుంది. ఆకలి దంచేస్తోంది. వంట చేసుకునే ఓపిక లేదు. వెంటనే ఫోన తీసి ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేసిందో అమ్మాయి. కాసేపట్లో ఆ ఆర్డర్ వచ్చేసింది. ఫ్రెండ్స్ తో కలిసి పార్సిల్ ఓపెన్ చేసింది. వేడివేడి బాతుమాంసం. చూస్తేనే నోరూరిపోతోంది వాళ్లకు. చాప్ స్టిక్స్ చేతిలో పట్టుకున్నారు. మాంసం ముక్కను అందుకున్నారు. కానీ, అది మాంసం ముక్క కాదు. చచ్చిన బొద్దింక. అమ్మో అనుకున్న ఆ ఫ్రెండ్స్ కు అనుమానం వచ్చింది. ఇంకా ఉండే ఉంటాయని మాంసం మొత్తం వెతికారు. ఒక్ొక్క బొద్దింకను బయటకు తీసి టిష్యూ పేపర్ పై పెట్టారు. అంతా అయ్యాక చూస్తే 40 చచ్చిన బొద్దింకలు లెక్క తేలాయి.

    40 cockroaches in duck dish..! Restaurant closed far 15 days..!!

    డామెట్..! అనుకున్న ఆ ఫ్రెండ్స్ వెంటనే రెస్టారెంట్ కు ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా పోలీసులకూ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఫుడ్డు అందించిన ఆ రెస్టారెంట్ కూడా దర్యాప్తు చేపట్టింది. 15 రోజుల పాటు రెస్టారెంట్ ను మూసేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ చైనాలోని షాంతూ అనే పట్టణంలో జరిగిందీ ఘటన.

    తినే అన్నంలోనో, కూరలోనో చినన పురుగొస్తేనే యాక్ అని.. ఆ భోజనం మొత్తాన్ని పక్కకు పెట్టేస్తాం. అలాంటిది, 40 బొద్దింకలంటే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుం దో ఒక్కసారి ఊహించుకోండి!! అందుకే భార‌త్ లో కూడా స్వైర విహారం చేస్తున్న ఫ‌డ్ యాప్ ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక హైద‌రాబాద్ లో డ‌జ‌న్ల కొద్ది పుట్టుకొచ్చిన ఫుడ్ కోర్టులు, ఆన్ లైన్ ఆర్డ‌ర్ల ప‌ట్ల కూడా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ి సూచిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+