ముసలమ్మే కానీ మహానుభావురాలు.. పాముతో అలా... బామ్మ వీడియో వైరల్!

పాము పేరు చెబితేనే మనలో చాలామంది భయంతో వణికి పోతారు. ఎక్కడైనా పాము ఉంది అంటే అటువైపు వెళ్లాలంటేనే భయపడతారు. సహజంగా ఈ సీజన్లో పాములు ఎక్కడపడితే అక్కడ సంచరిస్తూ ఉంటాయి. పుట్టలలో నుంచి బయటకు వచ్చి తిరిగే పాములను చూసి వాటి నుండి తప్పించుకుని పారిపోవడానికి, లేదా వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

పామును పట్టుకుని మెడలో వేసుకున్న బామ్మ
కానీ ఓ బామ్మ ఇంట్లోకి వచ్చిన భారీ పామును ఎంతో ధైర్యంగా పట్టుకొని, అన్ని పాములు హానికరమైనవి కావని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసున్న బామ్మ నిర్భయంగా పామును పట్టుకొని మెడలో వేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

70 years old woman catched snake and wrapped it around her neck video viral

Take a Poll

70 సంవత్సరాల వయసున్న బామ్మ సాహసం
పూణేలోని ముల్షి తాలూకాలోని కాసర్ అంబోలి గ్రామంలో 70 సంవత్సరాల వయసున్న శకుంతల సుతార్ అనే వృద్ధురాలు తన ఇంట్లోకి ప్రవేశించిన పామును చాలా ధైర్యంగా పట్టుకుంది. ఎనిమిది అడుగుల పొడవైన పామును ఎటువంటి సహాయం లేకుండా చేత్తో పట్టుకున్న బామ్మ ఆపై ఆ పామును మెడలో వేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పాముల పై ప్రజలలో అవగాహన పెంచడం కోసమే
ఎలుకల కోసం వచ్చిన పామును ఏమాత్రం భయం లేకుండా పట్టుకున్న 70 ఏళ్ల వృద్ధురాలు ఆ పాము గురించి మాట్లాడుతూ పాముల పై ప్రజలలో అవగాహన పెంచడం కోసమే తాను ఈ విధంగా చేశానని చెప్పింది. ప్రతి పాము విషపూరితమైన పాము కాదని, కొన్ని పాములు ఏమాత్రం విషం లేని పాములు కూడా ఉన్నాయని పేర్కొంది. తన ఇంటికి వచ్చిన పాము కూడా విషపూరితమైన పాము కాదని చెప్పింది.

పాములతో రైతులకు మేలు
అది కేవలం ఎలుకలను మాత్రమే చంపి తింటుందని తెలిపింది. అయితే పామును చూడగానే భయం కారణంగా చాలామంది పాములను చంపుతున్నారని పేర్కొంది. కానీ పాములను చంపడం మంచిది కాదని ఆమె అభిప్రాయపడుతోంది. పాములు, ఎలుకలు, కీటకాలు వంటి వాటిని తిని పంట పొలాలను కాపాడడంలో రైతులకు సహాయం చేస్తాయని ఆమె తెలిపింది.

బామ్మలా మీరు పాములను పట్టుకోకండి.. నెటిజన్లు సలహా
ఇక పాముని ఎంతో ధైర్యంగా పట్టుకొని పాములు పై ప్రజలకు అవగాహన కలిగించే లాగా చేసిన బామ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ భామ ధైర్యసాహసాలను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. భారీ పామును ఎంతో ధైర్యంగా ఎదుర్కొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బామ్మ చేసిందని ఎవరు అటువంటి పనులు చేయొద్దని, పాములను పట్టుకునే ప్రయత్నం చేయొద్దని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+