వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 రోజులు బ్యాంకులకు హాలీడే, ఇంపార్టెంట్ అయితే ముందే ప్లాన్ చేసుకొండి..

|
Google Oneindia TeluguNews

అలర్ట్.. అలర్ట్... మార్చి నెలలో లావాదేవీలు చేయాలని అనుకుంటున్నారా.. ముఖ్యమైన ట్రాన్సాక్షన్ ఉన్నాయా.. అయితే ముందే ప్లాన్ చేసుకొండి. ఎందుకంటే మార్చిలో మొత్తం 8 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. నెలలో 31 రోజులు ఉన్న.. హాలీడేస్ రావడంతో నగదు బదిలీ/ డిమాండ్ డ్రాప్ట్/ చెక్ రూపంలో జాగ్రత్తా ఉండాలి. సమయానికి పని కావాలంటే అలర్ట్‌గా ఉండండి.

నెలలో నాలుగు ఆదివారాలు (7, 14, 21, 28) సాధారణే. రెండు శనివారాలు కూడా కామనే. రెండో శనివారం (13న), నాలుగో శనివారం (27న) బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీనికితోడు మహాశివరాత్రి (11న), హోలీ( 29న) పండుగలు కూడా మార్చి నెలలో వచ్చాయి. ఇవీ రెండు రోజులు బ్యాంకులకు సెలవు ఉండనుంది. మార్చి 27 నుంచి 29 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూతపడతాయి. నాలుగో శనివారం, ఆదివారం, హోలీ పండుగ వరుసగా మూడు రోజులు వచ్చాయి.

8 holidays in march month for banks

8 రోజులతో పాటు మరో రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. తొమ్మిది బ్యాంక్ ఎంప్లాయ్ యూనియన్లు మార్చి 15 నుంచి సమ్మెను ప్రకటించాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరగనుంది. సమ్మె జరిగితే మరో రెండురోజులు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు దిగితే మార్చి 14న ఆదివారం వచ్చింది కాబట్టి వరుసగా మూడు రోజులు బ్యాంకులు తెరుచుకోవనే విషయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది..

మార్చి నెలలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉంటే సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచింది. లేదంటే తమ పనుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. సో క్యాలెండర్ పక్కనపెట్టి.. పనులు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
8 holidays in march month for banks. any important transactions are have, please plan before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X