హర్యానాలో 8 లక్షల ఉద్యోగార్ధుల అలక-ఎన్నికల్లో ఓటింగ్ కు దూరం-కారణమిదే..!

హర్యానాలో ఈసారి ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తాము ఓటింగ్ కు దూరంగా ఉండాలని 8 లక్షల మంది నిరుద్యోగ యువత నిర్ణయించుకున్నారు. దీని వెనుక ఓ కీలక కారణమే ఉంది. దీంతో తాము ఈసారి ఎన్నికల్లో ఓటు వేయబోవడం లేదని తేల్చిచెప్పేస్తున్నారు. దీంతో అధికార బీజేపీ అభ్యర్ధులకు ఇదో పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇంతకీ వారు ఎందుకు ఓటేసేందుకు నిరాశక్తత చూపుతున్నారో ఓసారి చూద్దాం..

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో 2022లో 32 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కామన్ ఎలిజబులిటీ టెస్ట్ పేరుతో ఓ పరీక్షను కూడా నిర్వహించింది. దీనికి 8 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకుని పరీక్షలు కూడా రాశారు. అయితే ఆ పరీక్షల ఫలితాలు ఇప్పటివరకూ వెల్లడించలేదు. దీంతో ఉద్యోగాల కోసం పరీక్షలు రాసినా ఫలితాలు వెల్లడించకపోవడం, తమకు ఉద్యోగాలు కల్పించకపోవడంపై వారంతా ఆగ్రహంగా ఉన్నారు.

8 lakh unemployed job aspirants against voting in haryana polls- here is reason

అందుకే ఈసారి ఎన్నికల్లో తాము ఓటేసేందుకు సిద్ధంగా లేమని ఈ నిరుద్యోగ అభ్యర్ధులు చెప్పేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ సర్కార్ పై వీరికి ఉన్న ఆగ్రహం ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్ధులకు సమస్యగా మారబోతోంది. అయితే విపక్ష కాంగ్రెస్ కు కూడా వీరు ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఎన్నికల వేళ ఇరు పార్టీల్లోనూ ఇది టెన్షన్ రేపుతోంది. ఇదో ఎన్నికల అంశంగా మారిపోవడంతో అంతిమంగా ఇది ఎవరికి ప్రయోజనం కల్పించబోతోందో తెలియక హర్యానాలో అభ్యర్ధులు తలపట్టుుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+