ఇక బెంజ్ కారు ఆయన సొంతం: 8ఏళ్ల నాటి కల 88ఏళ్లనాడు నెరవేర్చుకున్న రైతు, ‘సెలబ్రేషన్స్’
Recommended Video

చెన్నై: మనం ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించే వరకు నిద్రపోము. అది మనం సాధించినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఈ ఘటనలో కూడా బాలుడిగా ఉన్నప్పుడు కోరుకున్న ఓ కోరికను.. 88ఏళ్ల వయస్సులో తీర్చుకున్నాడు ఓ రైతు. ఆయన బలమైన కోరిక బెంజ్ కారు కావడం విశేషం.

ఆ కారు పేరు కూడా తెలియదు
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన దేవరాజన్ వ్యవసాయం చేస్తుంటారు. ఆయన తన 8ఏళ్ల వయసులో రాజన్.. మెర్సిడస్ బెంజ్ కారు చూసి తనకు కూడా ఆ కారు ఉంటే బాగుంటుందని అనుకున్నాడు. అయితే, అప్పట్లో అతనికి ఆ కారు పేరు కూడా తెలియదు. కానీ ఆ కారును చూడగానే తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

లక్ష్యాన్ని చేరుకునేందుకు..
ఆ కారుకు ఎక్కువ డబ్బులు అవసరమవుతాయని తెలిసి.. ఎంతో కష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటూనే.. మరో వైపు తన ‘కారు' కోసం డబ్బులో కొంత మొత్తాన్ని కేటాయించాడు. ఎట్టకేలకు ఆ కారు కొనుగోలుకు అవసరమయ్యే మొత్తం రూ.33లక్షలు జమ చేశాడు. ఆ డబ్బుతో తన బెంజ్ కారు కలను తీర్చుకున్నాడు.

నా 8ఏళ్ల నాటి కల..
‘చిన్నప్పుడు ఎక్కడికి వెళ్లాలన్నా.. సైకిల్ లేదా ఎద్దుల బండినే వాడేవాడిని. ఓసారి నాకు 8ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు బెంజ్ కారును చూశాను. నా జీవితంలో అలాంటి కారును చూడటం అదే మొదటి సారి. కనీసం ఆ కారు పేరు కూడా నాకు తెలియదు. కారు లోగో నాకు నచ్చింది. దీంతో ఎప్పటికైనా ఆ కారును సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ రోజు నా కల నెరవేరింది. కారును సొంతం చేసుకోగలిగాను. ఈ క్రెడిట్ అంతా నా భార్యదే' అని మురిసిపోయాడు దేవరాజన్.
కేక్ కట్ చేసి సంబరాలో.. హీరో అయ్యారు
కాగా, రాజన్ చిన్నప్పటి కోరిక గురించి తెలిసి బెంజ్ షోరూం డీలర్లు కూడా ఎంతో ముచ్చటపడ్డారు. అంతేగాక, ఎంతో కష్టపడి జీవితంలో అనుకున్నది సాధించిన రాజన్ చేత కేక్ కట్ చేయించి సంబరాలు కూడా జరపడం గమనార్హం. రాజన్ తన 8ఏళ్ల వయస్సు నాటి కలను 88ఏళ్ల వయస్సులో తీర్చుకోవడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఆ వీడియోను చెన్నై బెంజ్ కారు డీలర్ ట్రాన్స్ కారు ఇండియా ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం రాజన్ సోషల్ మీడియాలో కూడా హీరో అయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications