7500 కానిస్టేబుల్ పోస్టులు: ఒక్కో పోస్టుకు 13వేలమంది దరఖాస్తు, షాకింగ్ ఏంటంటే!

భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనకు ఎంత కృషి చేస్తున్నప్పటికీ ఇంకా నిరుద్యోగం కనిపిస్తూనే ఉంది. ఎక్కడ చూసినా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. పది ఉద్యోగాలు ఉంటే వేల మంది ఉద్యోగాల దరఖాస్తులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితి మన దేశంలో ఉన్న నిరుద్యోగ వ్యవస్థను కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.

7500 ఉద్యోగాల పోస్టులకు 9.39లక్షలకు పైగా దరఖాస్తులు
ఇక తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి కానిస్టేబుల్ పోస్టుల ఖాళీల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ తో బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 7500 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానిస్టేబుల్ పోస్టులకు విద్యావంతులైన యువత పోటీ పడ్డారు. ఊహించని విధంగా 7500 ఉద్యోగాల పోస్టులకు 9.39 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

9 5 lakh applications for 7500 constable jobs ph d holders engineers applied

Take a Poll

ఒక కానిస్టేబుల్ పోస్టుకు 13వేల మంది దరఖాస్తు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో ఇంజనీర్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు, డిప్లమా ఇంజనీర్లు, పిహెచ్డి హోల్డర్లు ఇలా ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణత మాత్రమే అయినప్పటికీ ఎంతో మంది ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేయడం విస్మయానికి గురి చేస్తుంది. ఒక కానిస్టేబుల్ పోస్టుకు 13వేల మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఉద్యోగం కోసం దరఖాస్తుదారులలో 42మంది పీహెచ్డీ హోల్డర్లు
మొదట కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తేదీన ఇవ్వగా, సెప్టెంబర్ 29వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. అయితే మళ్లీ పొడిగించిన నేపథ్యంలో అక్టోబర్ ఆరవ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. దీనికి సంబంధించిన పరీక్ష అక్టోబర్ 30వ తేదీన జరగనుంది. మధ్యప్రదేశ్ ఎంప్లాయిస్ సెలక్షన్ బోర్డు ఇచ్చిన ఈ కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లో ఉద్యోగం కోసం దరఖాస్తుదారులలో 42మంది పీహెచ్డీ పట్టాలు పొందినవారు ఉన్నారు.

నిరుద్యోగ వ్యవస్థను కళ్లకు కట్టిన ఘటన
12,000 మంది ఇంజనీరింగ్ చేసిన గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరందరికీ సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కానిస్టేబుల్ పోస్టులు అయినా పరవాలేదని వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. ఇక ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు పరిమితంగా ఉన్నాయని, ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే, చిన్న ఉద్యోగమైనా సరే దరఖాస్తు చేసుకున్నట్టు చాలామంది నిరుద్యోగులు చెబుతున్నారు. కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఇచ్చిన ఈ నోటిఫికేషన్ మన భారతదేశంలోని నిరుద్యోగ వ్యవస్థను కళ్లకు కడుతుంది. ప్రభుత్వాలనే కాదు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+