అసెంబ్లీలో వీర మహిళలు, మంత్రిని ఓడించిన మేడమ్, ఏ పార్టీకి ఎన్నిసీట్లు అంటే !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఎమ్మెల్యేలు విధాన సౌధలో అడుగు పెట్టడానికి సిద్దం అవుతున్నారు. కర్ణాటక అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కానున్నారు. కర్ణాటకలో 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించి అధికారంలో ఉండానికి సిద్దం అయ్యింది.
2019 జులై నెల నుంచి కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని కన్నడిగులు ఇంటికి పంపించేశారు. కర్ణాటకలో ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ 66 సీట్లు మాత్రమే విజయం సాధించి ఇప్పుడు అయోమయంలో పడిపోయింది. కర్ణాటక రాజకీయాల్లో కింగ్ మేకర్ అవతారం ఎత్తుతున్న జేడీఎస్ పార్టీని కూడా కన్నడిగులు ఆదరించలేదు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పేరుమోసిన రాజకీయ నాయకులనే ప్రజలు మట్టికరిపించి ఓడించడం కలకలం రేపింది. 11 మంది మంత్రులను ప్రజలు ఓడించారు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్ తదితరులు సైతం ఎన్నికల ప్రచారం చేసినా బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు.
ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయ్యింది. మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యే అవకాశం ఉంది. శనివారం రాత్రి సీఎం పదవికి రాజీనామా చేసిన బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటకలో కొత్త సీఎం వచ్చే వరకు అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

కర్ణాటకలో అసెంబ్లీలో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మహిళలు ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 9 మంది మహిళలు విజయం సాధించారు. ఇక్కడ హైలెట్ ఏమిటంటే స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లతా మల్లికార్జున్ హరప్పనహళ్లిలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి అన్న, బీజేపీ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కర్ణాటక శాసన సభలో ఎమ్మెల్యేలుగా అడుగుపెడుతున్న మహిళలు వీరే.
* రూపా శశిధర్- కేజీఎఫ్- కాంగ్రెస్
* లక్ష్మీ హెబ్బాళ్కర్- బెళగావి గ్రామీణ- కాంగ్రెస్
*. కనిజా ఫాతిమా- కలబురిగి- కాంగ్రెస్
* నయనా మోటమ్మ- మూడిగెరె- కాంగ్రెస్
* భాగీరథి మురళ్య- సూళ్య- బీజేపీ
* శశికళ జోల్లా (మాజీ మంత్రి)- నిప్పాణి- బీజేపీ
* జి. కెరమ్మ- దేవదుర్గ- జేడీఎస్
* శారదా పూర్యనాయక్- శివమొగ్గ గ్రామీణ- జేడీఎస్
** లతా మల్లికార్జున్- హరప్పనహళ్లి- స్వతంత్ర పార్టీ అభ్యర్థి (కాంగ్రెస్ పార్టీ రెబల్ లేడీ లీడర్)












Click it and Unblock the Notifications