వేధింపులు తట్టుకోలేక 9 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. కారణం వాళ్లే !
జైపూర్‌లోని ఓ ప్రముఖ పాఠశాలలో జరిగిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. తోటి విద్యార్థుల వేధింపులు , లైంగిక దాడులు తట్టుకోలేక 9 ఏళ్ల బాలిక పాఠశాల భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన నవంబర్ 1న జైపూర్‌లోని నీర్జా మోదీ స్కూల్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా తమ కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యల గురించి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా నాలుగో తరగతి చదువుతున్న అమాయ్రా.. కొంతకాలంగా పాఠశాలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నట్లు ఆమె తల్లి శివాని మీనా తెలిపారు. ఏడాది క్రితం తన కుమార్తె అమ్మా నేను స్కూల్‌కు వెళ్ళను.. నన్ను పంపొద్దు" అని ఏడుస్తున్న ఆడియోను వాట్సాప్‌లో రికార్డ్ చేసి క్లాస్ టీచర్‌కు పంపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. సమస్యను పరిష్కరిస్తారని భవించినా.. పాఠశాల సిబ్బంది తమ ఫిర్యాదులను నిర్లక్ష్యం చేశారని ఆమె ఆరోపించారు.

చిన్నారి తండ్రి విజయ్ మీనా మాట్లాడుతూ.. ఓ పేరెంట్-టీచర్ మీటింగ్‌లో కొందరు విద్యార్థులు తన కుమార్తెను, మరో అబ్బాయిని చూపిస్తూ సైగలు చేయడంతో అమాయ్రా భయపడి తన వెనుక దాక్కుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్ళగా, "ఇది కో-ఎడ్ స్కూల్, అబ్బాయిలతో కూడా మాట్లాడటం నేర్చుకోవాలి" అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆయన వాపోయారు. "అబ్బాయిలతో మాట్లాడాలా? వద్దా? అనేది నా కుమార్తె ఇష్టం" అని తాను స్పష్టం చేసినట్లు విజయ్ మీనా తెలిపారు.
ఆత్మహత్యకు ముందు అమాయ్రా రెండుసార్లు తన క్లాస్ టీచర్‌తో మాట్లాడినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైంది. అయితే సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం క్లాస్‌రూమ్ సీసీటీవీల్లో ఆడియో రికార్డింగ్ తప్పనిసరైనప్పటికీ.. ఈ ఫుటేజ్‌లో సౌండ్ లేకపోవడం గమనార్హం. అలానే ఆరంతస్తుల భవనానికి కనీస భద్రతా చర్యలుగా గ్రిల్స్ లేదా నెట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ ఘటనపై జైపూర్ డీసీపీ రాజర్షి రాజ్ వర్మ స్పందిస్తూ.. తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అంతే కాకుండా కొందరు విద్యార్థులు అమర్యాదకరమైన పదజాలం వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన విచారణ కొనసాగుతోంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications