హెచ్ 4 వీసాల్లో 93 శాతం ఇండియన్స్‌కే: రిపోర్ట్
న్యూఢిల్లీ: అమెరికాలో హెచ్-4 వీసాలు పొందిన వారిలో 93 శాతం మంది ఇండియన్స్ ఉన్నారని తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణుల జీవిత భాగస్వాముల కోసం ఈ హెచ్-4 వీసాలు మంజూరు చేస్తారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సుమారు ఐదోవంతు కంటే ఎక్కువ మంది హెచ్ 4 వీసాలు పొందినవారున్నారని ఆ నివేదిక వెల్లడిస్తోంది. ఉపాధి కోసం మంజూరు చేసిన హెచ్ 4 వీసాల్లో 93 శాతం మహిళలకు జారీ చేస్తే, 7 శాతం పురుషులకు ఇచ్చినట్టుగా ఈ నివేదికలోని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
యూఎస్ కు చెందిన సీఆర్‌ఎస్ సంస్థ ఈ నివేదికను వెల్లడించింది. యూఎస్ చట్టసభ సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాలపై కాలానుగుణంగా ఈ సంస్థ నివేదికలను సిద్ధం చేస్తుంది.

హెచ్4 కింద ఉపాధి కోసం జారీ చేసిన వీసాల్లో 93 శాతం భారత్‌కు చెందిన వారికి మంజూరు చేశాం. చైనాకు 5 శాతం మంజూరు కాగా.. ఇతర దేశాలకు చెందిన వారికి 2 శాతం వీసాలిచ్చినట్టు అని సీఆర్‌ఎస్ తన 9 పేజీల నివేదికలో వెల్లడించింది.
2017, డిసెంబర్ 25 నాటికి హెచ్4 వీసాదారుల 1,26,853 దరఖాస్తులను అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ఆమోదించింది. వీటిలో 90,946 ప్రాథమిక ఆమోదాలు పొందాయి. 35,219 రెన్యూవల్స్, 688 కార్డులు కోల్పోయిన వారి కోసం జారీ చేసినవి ఉన్నాయి.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications