అమ్మాయికి చాక్లెట్ ఇచ్చిన 16 ఏళ్ల అబ్బాయి, తరువాత ఏం చేశాడంటే ? !
ముంబాయి: మహారాష్ట్రలోని ముంబాయి నగర శివారులోని ఖార్‌లో 6 ఏళ్ల బాలికతో అసహజ సెక్స్‌లో పాల్గొన్న 16 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు చాక్లెట్ ఇస్తానని ప్రలోభపెట్టి తన గదిలోకి తీసుకెళ్లిన బాలుడు చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు తెలిపారు.
సాయంత్రం బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు అన్నారు.
ఒక టీనేజ్ కుర్రాడు ఆమె దగ్గరికి వెళ్లి నీకు చాక్లెట్ ఇస్తానని చెప్పాడు. చిన్నారిని అతని గదికి తీసుకెళ్లి అక్కడే ఈ నేరానికి పాల్పడ్డాడని ఓ అధికారి స్థానిక మీడియాకు చెప్పారు. నిందితుడు, బాధితురాలు ఒకే ప్రాంతానికి చెందిన వారని ఆ పోలీసు అధికారి మీడియాకు వివరించారు. ఈ సంఘటన తర్వాత బాధితురాలు భయపడి ఏడ్వడం ప్రారంభించింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఏం జరిగింది అని అడగగా ఆమె జరిగిన సంఘటనను వివరించిందని ఆ పోలీసు అధికారి చెప్పారు.

బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై నిందితుడి మీద పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ సమీపంలో రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాని ఓ అమ్మాయి మీద లైంగిక వేధింపుల పాల్పడ్డాడనే ఆరోపణలపై 15 ఏళ్ల బాలుడిపై పోలీసులు గత వారం అరెస్టు చేశారు.

ఫిర్యాదు చేసిన చిన్నారి తల్లి తెలిపిన వివరాల ప్రకారం బాలుడి కుటుంబం వారి ఇంటి పక్కనే నివాసం ఉంటున్నదని పోలీసులు తెలిపారు. సాయంత్రం బాలిక తల్లి ఆ బాలుడిని పిలిచి సమీపంలోని కిరాణా దుకాణం నుండి చక్కెర తీసుకురావాలని కోరింది. చక్కర ప్యాకెట్ తీసుకుని ఇంటికి వెళ్లిన బాలుడు చిన్నారిని ఆడించినట్లు నటించి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications