ఈ సీఎంకు బుద్దిలేదు, నాకున్న తెలివి కూడా లేదు, 8 ఏళ్ల బాలుడు ఫైర్ !
బెంగళూరు/చామరాజనగర్: తమిళనాడుకు కావేరీ (cauvery) జలాలను మళ్లించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి కర్ణాటక బంద్ నిర్వహించారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ నిరసన తీవ్రతరం అవుతోంది. అలాగే నిరసన కార్యక్రమంలో మూడో తరగతి బాలుడు సీఎం సిద్ధరామయ్యపై (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నాకున్నంత తెలివితేటలు లేవని, అసలు సీఎం సిద్దరామయ్యకు నాకు ఉన్న బుద్దికూడలేదని ఆ బాలుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ప్రభుత్వం చామరాజనగర్ కు వదిలే నీటిని తమిళనాడుకు విడుదల చేసిందని ఆ బాలుడు ఆరోపించారు. తమిళనాడుకు నీరు (cauvery)విడుదల చేసిన సీఎం సిద్దరామయ్యకు (Siddaramaiah)చామరాజనగర ప్రజలు గిన్నెలు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవని తెలీదా అని బాలుడు ప్రశ్నించాడు.

ఆ విషయం కూడా సిద్దరామయ్యకు (Siddaramaiah) కనపడలేదని 3వ తరగతి చదువుతున్న బాలుడు ఆరోపణలు చేశాడు. నాకు తెలివితేటలు ఉన్నాయని, కర్ణాటక ప్రభుత్వంలోని పెద్దలకు, సీఎం సిద్దరామయ్యకు (Siddaramaiah)తనకు ఉన్న తెలివితేటలు లేవని ఆ బాలుడు మీడియా ముందు మాట్లాడటంతో అందరూ బిత్తరపోయారు. కావేరీ (cauvery)నీటిని తమిళనాడుకు విడుదల చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వాన్ని తాను అసహ్యించుకుంటున్నానని ఆబాలుడు అన్నాడు.
కర్ణాటకలో వర్షాలు లేనప్పుడు కావేరి నీరు తమిళనాడుకు ఎలా ఇవ్వాలి? అనే విషయం సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah)తెలియడం లేదని, కావాలనే తమిళనాడుకు కావేరి (cauvery) నీటిని విడుదల చేశారని ఆ బాలుడు ఆరోపించాడు. చామరాజనగరలో 3వ తరగతిచదువుతున్న బాలుడు తనకు ఉన్న బుద్ది సీఎం సిద్దరామయ్యకు లేదని చెప్పడం కన్నడ మీడియాలో తీవ్రచర్చకు దారితీసింది. సీఎం సిద్దరామయ్యను (Siddaramaiah) మీడియా ముందు తీవ్రస్థాయిలో విమర్శించిన బాలుడు మైనారిటీ వర్గానికి చెందిన వాడు కావడం, మైనర్ కావడంతో కాంగ్రెస్ నాయకులు ఆ బాలుడిని విమర్శించలేక సైలెంట్ గా ఉండిపోయారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications