సెల్ఫీ కాదు, సెల్ఫ్ కిడ్నాప్, సొంత కొడుకులా చూస్తున్న కంపెనీ యజమానికి ఏం చేశాడంటే ?
బెంగళూరు/పాట్నా: సొంత ఊరిలో డబ్బులు సంపాధించడానికి పనిలేకపోవడంతో ఉద్యోగం వెతుక్కుంటూ ఓ యువకుడు ఐటీ హబ్ కు చేరుకున్నాడు. ఓ కంపెనీలో (company)చాలా సంవత్సరాల నంచి ఆ యువకుడు ఉద్యోగం చేస్తున్నాడు. కంపెనీ యజమాని (company owner) ఆ ఉద్యోగిని పనివాడిలా కాకుండా సొంత కొడుకులా చూసుకుంటున్నాడు.
అయితే అన్నంపెట్టి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ యజమానికి (company owner) ఆ యువకుడు ఏం చేశాడు అని అసలు మ్యాటర్ తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు. బీహార్ కు చెందిన నూరుల్లా హసన్ అలియాస్ నూరుల్లా (26) అనే యువకుడు డబ్బులు సంపాధించడానికి బీహార్ లో సరైన ఉద్యోగం లేకపోవడంతో 8 ఏళ్ల క్రితం బెంగళూరు చేరుకున్నాడు.

నూరుల్లా హసన్ తో పాటు బీహార్ కు చెందిన అబుబకర్, ఆలీ రాజా అనే యువకులు బెంగళూరు (Bengaluru) చేరుకున్నారు. బెంగళూరులో ఆర్ టీ నగర్ లో నివాసం ఉంటున్న ఆసీఫ్ హబీబ్ కు చెందిన కంపెనీలో (company owner) ఐదు ఏళ్ల క్రితం బీహార్ కు చెందిన నూరుల్లా హసన్ ఉద్యోగంలో చేరాడు. నూరుల్లా తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా అతన్ని కంపెనీ ఓనర్ హబీబ్ అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు.
కంపెనీ వ్యవహారాలతో (company owner) పాటు హబీబ్ సొంత విషయాలు కూడా నూరుల్లాకు తెలుసు. హబీబ్ దగ్గర భారీ మొత్తంలో డబ్బ ఉందని తెలుసుకున్న నూరుల్లా ఓ స్కెచ్ వేశాడు. నేను అంటే హబీబ్ కు చాలా ఇష్టమని, ఎలాగైనా హబీబ్ ను నిలువు దోపిడీ చేసి బీహార్ వెళ్లి కొంతకాలం లగ్జరీ లైఫ్ గడపాలని నూరుల్లా స్కెచ్ వేశాడు. తనకు సహయం చేస్తే డబ్బు వస్తుందని, అందులో మీకు కొంత వాటా ఇస్తానని నూరుల్లా అతని స్నేహితులు అబుకర్, ఆలీ రాజాలకు చెప్పాడు.
ఇటీవల నూరుల్లా, అతని స్నేహితులు క్యాబ్ లో మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యామ్ తదితర ప్రాంతాలు చూడటానికి వెళ్లారు. తరువాత నూరుల్లా అతను పని చేసే కంపెనీ యజమాని (company owner) హబీబ్ కు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ (kidnap) చేశారని, రెండు లక్షలు ఇవ్వకపోతే తనను ఇక్కడే చంపేస్తామని బెదిరిస్తున్నారని నూరుల్లా బోరున విలపించాడు.

నూరుల్లాను సొంత కొడుకులా చూసుకుంటున్న హబీబ్ రెండు లక్షలు ఇవ్వడానికికి సిద్దం అయ్యాడు. అయితే కిడ్నాపర్లు (kidnap) బ్యాంక్ అకౌంట్ ఇవ్వకుండా నూరుల్లా అతని బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించి ఈ నెంబర్ కు రూ 2 లక్షలు గూగుల్ పే చెయ్యాలని కంపెనీ ఓనర్ (company owner) హబీబ్ కు చెప్పాడు. కిడ్నాపర్ల బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాకుండా నూరుల్లా బ్యాంక్ అకౌంట్ నెంబర రావడంతో అనుమానం వచ్చిన హబీబ్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నూరుల్లా ఫోన్ నెంబర్ ట్రేస్ చెయ్యంతో నిందితులు అందరూ మండ్యలోని ఓ లాడ్జ్ లో ఉన్నారని వెలుగు చూసింది.
లాడ్జ్ కు వెళ్లిన బెంగళూరు పోలీసులు విచారణ చెయ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. సొంత కొడుకులా చూసుకున్న కంపెనీ యజమాని (company owner) హబీబ్ ను మోసం చెయ్యడానికి ప్రయత్నించిన నూరుల్లాతో పాటు అతని స్నేహితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు. సెల్ఫీ కాకుండా సెల్ఫ్ కిడ్నాప్ (kidnap)స్టోరీ అల్లిన నూరుల్లా ఇప్పుడు కటకటాలపాలైనాడు.












Click it and Unblock the Notifications