Rabies: యూపీలో ఘోరం.. రేబిస్‍తో బాలుడి మృతి..

కుక్క కరిస్తే చాలా ప్రమాదకం. కుక్క కరిచిన వెంటనే ఇంజెక్షన్లు వేయించుకోవాలి. లేకుంటే రేబిస్ వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఓ బాలుడు రేబిస్ తో చనిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఘజియాబాద్ కు చెందిన పద్నాలుగేళ్ల షావాజ్ కు కుక్క కరిచింది. సోమవారం సాయంత్రం బులంద్‌షహర్ నుంచి ఘజియాబాద్‌కు తిరిగి తీసుకువస్తున్నప్పుడు బాలుడు మరణించాడు. విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చరణ్ సింగ్ కాలనీలో నివాసముంటున్న మృతుడు 8వ తరగతి చదువుతున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతన్ని ఒకటిన్నర నెలల క్రితం పొరుగింటి కుక్క కరిచింది. అతను భయంతో అతని తల్లిదండ్రులకు చెప్పలేదు. దీంతో బాలుడు రేబిస్ బారిన పడ్డాడు. "అతను రేబిస్ బారిన పడ్డాడు. అసాధారణంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. సెప్టెంబర్ 1 న తినడం మానేశాడు. తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో పక్కింటి కుక్క కరిచిందని చెప్పాడు" అని పోలీసులు తెలిపారు. దీంతో బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Rabies:

చివరకు చికిత్స కోసం బులంద్‌షహర్‌లోని ఆయుర్వేద వైద్యుడి వద్దకు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంబులెన్స్‌లో తిరిగి ఘజియాబాద్‌కు తీసుకువస్తుండగా బాలుడు మృతి చెందాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేశామని, కుక్క యజమానిపై చర్యలు తీసుకుంటామని కొత్వాలి జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిమిష్ పాటిల్ తెలిపారు. పిల్లలకు కుక్కలు కరిస్తే ఏం జరుగుతుందో చెప్పాలని.. వారికి అవగాహన కల్పించాలని పోలీసులు కోరారు.

షావాజ్ భయంతో కుక్క కరిచినట్లు చెప్పకపోవడంతో రేబిస్ బారిన పడి మృతి చెందాడు. ఎప్పుడైనా కుక్కలు కరిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్లు ఉచితంగా వేస్తారు. హైదరాబాద్ కోరంటిలో కుక్క కాటు బాధితులు వచ్చే ఇంజేక్షన్లు వెయించుకుంటారు. సో ఎవరైనా కుక్క కరిస్తే నిర్లక్ష్యం చెయ్యొద్దని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+