అల్లు అర్జున్ సినిమా లైవ్ లో చూపించిన ప్రియుడు, లిప్ స్టిక్, గాజులు, గర్ల్ ఫ్రెండ్ డ్రస్, కట్ చేస్తే ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ కోసం హిందీ పరీక్ష రాయడానికి అల్లు అర్జున్ అమ్మాయి వేషం వేసిన విషయం తెలిసిందే. తన స్నేహితురాలు హిందీ పరీక్షలు ఫెయిల్ కాకుండా చూడాలని అమ్మాయి వేషం వేసిన అల్లు అర్జున్ పకీక్షా కేంద్రంలో సునీల్ ను బోల్తా కొట్టింటి హిందీ పరీక్ష రాసి బయటకు వచ్చేస్తాడు.
సినిమాలో కాబట్టి కామిడీ కోసం రాఘవేంద్రరావు వేసిన స్కెచ్ వర్కౌంట్ అయ్యింది. అయితే గంగోత్రి సినిమాను తలతన్నెలా ఓ ప్రేమికుడు అతని ప్రియురాలి కోసం అమ్మాయి వేషం వేసి పోటీపరక్షలు రాయడానికి వెళ్లాడు. ప్రియురాలి కోసం నకిలి ఆధార్ కార్డు కూడా తయారు చేయించాడు. ప్రియురాలి కోసం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ప్రియుడు ఇప్పుడు అతని ప్రియురాలిని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు.

పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో ఓ యువకుడు తన అతని ప్రియురాలి వేషంలో పరీక్ష రాయడానికి వెళ్లి అధికారులతో గొడవకు దిగి అడ్డంగా చిక్కిపోయాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనవరి 7వ తేదీన కోట్‌కాపూర్‌లోని డీఏవీ (DAV) పబ్లిక్ స్కూల్‌లో బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎగ్జామినేషన్ నిర్వహించబడింది.
ఫజిల్కాకు చెందిన అంగ్రేజ్ సింగ్ అలియాస్ అంగ్రేజ్ అనే యువకుడు అతని స్నేహితురాలు (గర్ల్ ఫ్రెండ్) పరమ్‌జిత్ కౌర్ వేషంలో పరీక్షకు హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. అంగ్రేజ్ సింగ్ పరీక్ష రాయడానికి సిద్ధం అయ్యాడు. ఎరుపు రంగు గాజులు, అదిరిపోయే అమ్మాయిల డ్రస్ వేసుకుని పెదవులకు లిప్‌స్టిక్ పూసుకుని అచ్చం మహిళలా వేషం వేసుకుని ఎవరికి డౌట్ రాకుండా అలంకరించుకున్నాడు.

అయితే అందరిని బోల్లా కొట్టించడానికి ప్రయత్నించిన ప్రియుడు అంగ్రేజ్ సింగ్ ను విశ్వవిద్యాలయ అధికారులు అతన్ని వెంటనే పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అంగ్రేజ్ సింగ్ ఫేక్ ఓటర్ ఐడీ కార్డు, నకిలి ఆధార్ కార్డుతో అతను పరంజిత్ కౌర్ అని నిరూపించేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు. దాదాపు అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్న అంగ్రేజ్ సింగ్ వేలిముద్రలను పరీక్షించే సమయంలో అధికారులకు పట్టుబడ్డాడు.
వేలిముద్రలు వేసే సమయంలో విఫలమైన తర్వాత బయోమెట్రిక్ పరికరంలో నిజమైన అభ్యర్థి వేలిముద్రలను సరిపోల్చడానికి అంగ్రేజ్ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నిజమైన అభ్యర్థి పరమ్‌జిత్ కౌర్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. మరోవైపు అంగ్రేజ్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రేమలో పడిన అంగ్రేజ్ సింగ్ అతని ప్రియురాలు పరమ్ జిత్ కౌర్ లాగా వేషం వేసుకుని ఆమెకు సహాయం చేయడానికి వెళ్లి పోలీసుకు అడ్డంగా చిక్కిపోయి ఇప్పుడు జైలుపాలు అయ్యాడు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications