పార్క్ పక్కన మిట్ట మద్యాహ్నం కారులో అమ్మానాన్న ఆట, ఎస్ఐ చూశాడని లవర్స్?
కర్ణాటక రాష్ట్ర రాజధాని అంతర్జాతీయ స్థాయిలో ఎంత ఉన్నతస్థాయిలో ఉన్నా ఇంకా ఫారిన్ కంట్రీ కల్చర్ రాలేదు. పబ్లిక్ పార్కులు, రోడ్లు, బస్టాప్‌లలో లిప్ లాక్ లు, ముద్దులు, కౌగిలించుకోవడం, రొమాన్స్ చేయడంపై బెంగళూరులో నిషేధం ఉంది. అయితే ఇక్కడ ఓ జంట పార్క్ పక్కనే రోడ్డు మీద కారు పార్క్ చేసి మిట్ట మధ్యాహ్నం కారులోనే శృంగారం చేస్తూ స్వర్గంలో తేలిపోయారు. ఇది గమనించిన ఎస్ఐ అక్కడికి వెళ్లి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు.
బెంగళూరు సురక్షితమైన నగరం, సంస్కృతితో కూడిన నగరంగా అందరూ నమ్ముతున్నారు. విదేశాల్లో ఉన్న సంస్కృతిని కొనసాగించడానికి బహిరంగంగా శారీరక కోరికలను నెరవేర్చడానికి భారతదేశంలో పాటు బెంగళూరులో కూడా అనుమతించరు. బెంగళూరులో అక్కడక్కడా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకునే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలపై అక్కడి ప్రజలు, స్థానిక పోలీసులు అప్రమత్తమై అలాంటి జంటలను అక్కడి నుంచి పంపిస్తున్నారు. ఇలాంటి దృశ్యాల వల్ల చిన్నపిల్లలపై ప్రతికూలంగా ప్రభావితమవుతారనేది నగర ప్రజల వాదన.

పార్క్ పక్కన ఊగుతున్న కారు:
బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ మహేశ్ జనవరి 20వ తేదీన మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో అతని ఇంటికి వెళ్లి భోజనం చేసి కొంతసేపటి తరువాత మళ్లీ బయటకు వచ్చేసరికి సమీపంలోని పార్క్ దగ్గర పార్క్ చేసిన కారు అటూఇటూ ఊగుతున్న విషయం గమనించాడు. తరువాత కొద్ది దూరం ముందుకెళ్లిన ఎస్ఐ మహేష్ తరువాత వెనక్కి తిరిగి చూడగా కారు వెనుక సీటులో ఓ యువకుడు, యువతి ఇద్దరూ నగ్నంగా రొమాన్స్ చేస్తూ కామం తీర్చుకుంటున్న విషయం గమనించి షాక్ అయ్యాడు.
పార్క్ దగ్గర, ఆ రోడ్డులో పాఠశాల విద్యార్థులు, మహిళలు తిరిగే రహదారి కావడంతో వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎస్‌ఐ మహేశ్ కారులో ఉన్న వారిని హెచ్చరించేందుకు, కారు నెంబర్ నోట్ చేసుకునేందుకు తిరిగి వెనక్కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఆ సమయంలో ఆ యువకుడు ఎస్ఐ మహేష్ ను చూసి భయపడిపోయి వెంటనే కారు ముందుసీటులోకి దూకి ఆ కారు స్టార్ట్ చేశాడు.కారు స్టార్ట్ చేయగానే ఎస్ఐ ఆ రోడ్డులో నుంచి మరో రోడ్డులోకి వెళ్లడానికి అవకాశం లేకుండాపోయింది.
కారులో అమ్మానాన్న ఆడిన జంట:
కారులో అంతవరకు అమ్మానాన్న ఆటఆడిన జంట ఎస్ఐ బారినుంచి తప్పించుకోవాలని డిసైడ్ అయ్యారు. తరువాత కారులో ఉన్న యువకుడు నేరుగా ఎస్ఐ మహేష్ పైనే కారు నడపబోయాడు. ఇంతలో ఎస్‌ఐ మహేశ్ అతని బైక్ కిందకు తోసేసి జంట ఉన్న కారు బానెట్‌పై పడిపోయాడు. ఇంత జరిగినా ఆ యువకుడు కారు వేగంగా నడిపడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ మహేష్ కారు బానెట్ గట్టిగా పట్టుకున్నాడు.
తరువాత ఆ యువకుడు ఆకారుకు రివర్స్ గేర్ వేసి ఒక్కసారిగా వెనక్కి నడిపాడు. దీంతో ఎస్‌ఐ మహేష్ బానెట్ పై నుంచి కిందపడిపోవడంతో అతని తలకు తీవ్రగాయాలై స్పృహతప్పి పడిపోయాడు. అక్కడున్న స్థానికులు విషయం గమనించి వెంటనే ఎస్ఐ మహేష్ ను ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం అతను కోలుకున్నాడు. ఎస్‌ఐ మహేశ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన తరువాత జ్ఞానభారతి పోలీస్ స్టేషన్ కు వెళ్లి హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు.
కారులో రొమాన్స్ చెయ్యడమే కాకుండా ఎస్ఐ మీద కారు నడిపి అతనికి తీవ్రగాయాలు కావడానికి కారణ: అయిన యువతి, యువకుడిని గుర్తించడానికి పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీటీవీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోకుండా ఇంకా విశ్రాంతి తీసుకుంటున్న ఎస్ఐ మహేష్ మాత్రం తనకు ఓసినిమా సంఘటన ఎదురైయ్యిందని ఆయన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడు.












Click it and Unblock the Notifications