Tomato: లారీ టమాటాతో జంపయిన డ్రైవర్.. రూ.21 లక్షలు మునిగిన వ్యాపారులు..
టమాటా ధరలు ఏ విధంగా పెరిగాయో మీ అందిరికీ తెలిసిందే.. దేశంలోని పలు చోట్ల టమాటా ధర కిలో రూ. 250 పైనే పలుకుతోంది. దీంతో టమాటా ఖరీదైన వస్తువుగా మారింది. దీంతో టమాటా దొంగలు కూడా పెరిగిపోయారు. కొద్ది రోజుల క్రితం కర్ణాటలో పొలంలో కోత సిద్ధంగా ఉన్న టమాటా పంటను రాత్రికి రాత్రికే కొందరు దుండగులు వచ్చి కోసుకెళ్లారు. ఏపీలో టమాటాలు అమ్మి వెళ్తున్న రైతును హత్య చేసి డబ్బు దోచుకెళ్లారు. జహీరాబాద్ కూరాగాయల మార్కెట్ లో ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోని వచ్చి టమాటా బాక్స్ లను ఎత్తుకెళ్లాడు.
ఆ తర్వాత కర్ణాటకలో ఓ దంపతులు టమాటా ట్రక్కను హైజక్ చేసి చెన్నై తీసుకెళ్లి టామాటాలు అమ్మారు. ఇలా టమాటా గురించి చాలా కథలు విన్నాం. తాజాగా ఓ లారీ డ్రైవర్ 11 వేల క్వింటాళ్ల టమాటాతో ఊడాయించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. లారీ డ్రైవర్ తీసుకెళ్లిన టమాటా ధర రూ.21 లక్షలు ఉంటుందని అంచనా. కర్ణాటకలోని కొలార్ ఎపిఎమ్సీ మార్కెట్ కు చెందిన కొందరు వ్యాపారులు స్థానిక రైతుల నుంచి 750 బాక్స్ ల టమాటాలను కొనుగోలు చేశారు. వాటిని లారీలోకి ఎక్కించారు.

ఆ టమాటాలను రాజస్థాన్ లోని జైపూర్ లో ఆన్ లోడ్ చేసి రావాలని డ్రైవర్ను పంపారు. జులై27 కర్ణాకట నుంచి లారీని పంపారు. ఆ లారీ జులై 30న జైపూర్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంక చేరుకోకపోవడంతో జైపూర్ కు చెందిన వ్యాపారులు కర్ణాటక వ్యాపారులకు సమచారం ఇచ్చారు. దీంతో వారు లారీ డ్రైవర్ అన్వర్ కోసం ఫోన్ లో ప్రయత్నించగా.. అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో వ్యాపారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ ఎక్కడుందో గాలింపు చేపట్టారు.
రాజస్థాన్ లోని జాలోర్ ప్రాంతంలో ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద లారీని గుర్తించారు. అయితే అందులో టమాటాలు లేవు. అన్వర్ వేరే వ్యక్తికి టమాటాలు విక్రయించినట్లు పోలీసులు చెప్పారు. అన్వర్ అహ్మదాబాద్ కు చెందిన ప్రకాష్గా కు టమాటాలు అమ్మినట్లు గుర్తించారు. ప్రస్తుతం అన్వర్ పరారీలో ఉన్నాడు. డ్రైవర్ అన్వర్ తో చివరగా శనివారం రాత్రి 9 గంటలకు మాతో మాట్లాడినట్లు బాధిత వ్యాపారులు తెలిపారు. ఆ తర్వాత డ్రైవర్ ఫోన్ స్వీచ్ఛాఫ్ వచ్చందని చెప్పారు. అందుకే పోలీసులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications