Lady: నీకు దెయ్యం పట్టింది, క్షుద్రపూజలు చెయ్యాలి, వెంటనే ఇంటికి వచ్చేయ్, కట్ చేస్తే ? దెబ్బకు !

లక్నో/ఉత్తరప్రదేశ్: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళ అనేక ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంది. మహిళకు ఆరోగ్యం కుదటపడకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. తెలిసివాళ్లు నువ్వే వేరే ఆసుపత్రిలో చూపించుకోవాలని ఆమెకు సూచించారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఆమెకు మాత్రం జబ్బు నయం కాలేదు. మంత్రగాడిని సంప్రధించాలని ఓ వ్యక్తి ఆమెకు ఉచిత సలహా ఇచ్చేశారు.
భూతవైద్యుడి దగ్గర చూపించుకోవాలని తెలిసినవాళ్లు ఆమెకు సూచించారు. భూత వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఆమె జీవితం అదోగతి అయ్యింది. హోటల్ లో న్యూఇయర్ పార్టీ చేసుకుంటున్న మంత్రగాడు పోలీసులకు చిక్కాడు.

మంత్రగాళ్ల చేతబడులు, నరబలి

మంత్రగాళ్ల చేతబడులు, నరబలి

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేతబడి, నరబలి, భూతవైద్యం తదితర నకిలీ మంత్రగాళ్ల ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వస్తునే ఉన్నాయి. అయినా ఇప్పటికే చాలా మంది నకిలి మంత్రగాళ్లను సంప్రధించి వారి చేతిలో మోసపోతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు పోయాయి. అలా ఇలా దెయ్యాలను తరిమివేస్తానంటూ ఓ మహిళపై నకిలీ మంత్రగాడు అత్యాచారానికి పాల్పడిన షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

నకిలి మంత్రగాడు

నకిలి మంత్రగాడు

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన ఓ మహిళ తన వ్యక్తిగత సమస్య కారణంగా రాజా షేక్ అలియాస్ రాజా అలియాస్ షేక్ అనే మంత్రగాడిని సంప్రదించింది. తాను చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, మీరే నా జబ్బు నయం చెయ్యాలని ఆమె మంత్రగాడు రాజా షేక్ ను వేడుకుంది.

ఇంటికి వచ్చిందని.......చాన్స్ చిక్కిందని ?

ఇంటికి వచ్చిందని.......చాన్స్ చిక్కిందని ?

నీ శరీరంలోకి దుష్టశక్తులు వచ్చాయని, నీకు పట్టిన దెయ్యాలను వెళ్లగొట్టి నయం చేస్తానని రాజా షేక్ ఆమెకు మాయమాటల చెప్పాడు. డిసెంబర్ 29న రాజా షేక్ ఆ మహిళను తన ఇంటికి ఆహ్వానించాడు. రాజా షేక్ అతని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె అతని ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో నకిలి మంత్రగాడు రాజా షేక్ ఆ మహిళను బెదిరించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

హోటల్ లో మంత్రగాడి న్యూఇయర్ పార్టీ

హోటల్ లో మంత్రగాడి న్యూఇయర్ పార్టీ

అత్యాచారం జరిగిన విషయం ఎవరికైనా చెబితే నీకు నిజంగానే దెయ్యం పట్టేట్టట్లు మంత్రాలు వేస్తాని, నిన్ను చంపేస్తానని బెదిరించిన రాజా షేక్ ఆమెను ఇంటి నుంచి బయటకు పంపించేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న రాజా షేక్‌ను ఆదివారం రాత్రి ఓ హోటల్‌లో పార్టీ చేసుకుంటున్న మంత్రగాడిని పోలీసులు పట్టుకున్నారు. మహిళ ఫిర్యాదు మేరకు రాజా షేక్‌పై అత్యాచారం చేశాడని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో సహా పలు చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ యశ్వీర్ సింగ్ స్థానిక మీడియాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+