ఐఎఎస్ టాపర్స్: ప్రేమ..పెళ్లి..ఈగో..విడాకులు: అంతా రెండున్నరేళ్లలోపే

జైపూర్: వారిద్దరూ ఐఎఎస్ టాపర్లు. 2015 నాటి సివిల్స్ పరీక్షల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.. వార్తల్లో నిలిచారు. వారిద్దరి పేర్లు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. ఐఎఎస్ టాపర్స్‌గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. సరిగ్గా మూడేళ్ల తరువాత.. ఆ ఇద్దరు ఒకింటి వారయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహబంధంతో ఒక్కటయ్యారు. అక్కడతో వారి కొత్త జీవితం ఆరంభమైందనుకునేలా లోపే.. దానికి పుల్‌స్టాప్ పడింది. ఇద్దరి మధ్యా మనస్పర్థలొచ్చాయి. కోర్టు మెట్లెక్కారు.

విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్లలోనే వివాహ బంధం తెగింది. ఆ ఇద్దరూ టీనా దబీ.. అథర్ అమీర్ ఖాన్. 2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ సివిల్స్ పరీక్షల్లో టాపర్లు. టీనా దబీ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అమీర్ ఖాన్‌ది రెండో ర్యాంక్. టీనా దభీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్. దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కళాశాల విద్యార్థిని. అథర్ అమీర్ ఖాన్ ఆప్షన్ సబ్జెక్ట్ ఫిలాసఫీ. ఇద్దరూ రాజస్థాన్ క్యాడర్‌కు ఎంపికయ్యారు.

అమీర్ ఖాన్ స్వరాష్ట్రం జమ్మూ కాశ్మీర్. ఉగ్రవాద కార్యకలాపాలతో నిత్యం సతమతమయ్యే జమ్మూ కాశ్మీర్ నుంచి ఐఎఎస్ టాపర్‌గా నిలిచిన యువకుడిగా అప్పట్లో అతను దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాడు. అతని స్వస్థలం అనంత్‌నాగ్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌లో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. సివిల్స్ ఫలితాలు వెలువడిన రెండేళ్లకు వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి వివాహానికి పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

A family court in Jaipur has granted divorce to IAS Topper Couple Tina Dabi And Athar Aamir Khan

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అప్పటి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వంటి బడా నాయకులు ఆశీస్సులను అందుకున్నారు. మరోసారి వార్తల్లో హెడ్‌లైన్స్‌గా నిలిచారు. మతాంతర వివాహం కావడం వల్ల అప్పట్లో టీనాదబీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు సైతం చెలరేగాయి. దాన్ని పట్టించుకోలేదు. అంతా సజావుగా సాగుతోందనుకునే లోపే ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒకరికొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. భేదాభిప్రాయాలను అధిగమించలేకపోయారు. ఈగోను పక్కన పెట్టలేకపోయారు. ఏడాదిన్నర లోపే వారి వైవాహిక బంధానికి తెర పడింది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Recommended Video

    Jaipur Metro Coaches For Events అద్దెకు మెట్రో... నాలుగు గంటలకు రూ.5000..!! || Oneindia Telugu

    కిందటి ఏడాది నవంబర్‌లో వారిద్దరూ విడాకుల కోసం రాజస్థాన్‌లోని జైపూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. డైవోర్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవడానికి ఫ్యామిలీ కోర్టు వారికి మరో అవకాశాన్ని ఇచ్చింది. అయినప్పటికీ.. మార్పు రాలేదు. విడాకులను తీసుకోవడం వైపే మొగ్గ చూపారు. దీనితో జైపూర్ ఫ్యామిలీ కోర్టు తాజాగా టీనా దబీ-అథర్ అమీర్ ఖాన్‌కు విడాకులను మంజూరు చేసింది. దీనితో వారిద్దరి వైవాహిక బంధానికి రెండున్నరేళ్లలోనే తెర పడింది. రెండు కుటుంబాల వారు కూడా సర్దిచెప్పే పరిస్థితి లేకపోవడం వల్లే టీనా దబీ-అథర్ అమీర్ ఖాన్ వైవాహిక బంధం విడాకుల దాకా వెళ్లిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+