సీఎంకు ఇలాంటి బహుమతులు ఇస్తారా ?, గిఫ్ట్ చూసి షాక్ అయ్యిన సీఎం, నాయకులు, ఫ్యాన్స్ !
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే భారీగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఏప్రిల్ 12వ తేదీన శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చామరాజనగర జిల్లాలోని కొళ్లేగాళలో ప్రజావాణి సదస్సు నిర్వహించారు ఇదే సమయంలో సీఎం సిద్దరామయ్య లోక్ సభ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే సీఎం సిద్దరామయ్యకు ఓ అభిమాను ఇచ్చిన బహుమతి చూసి అందరూ షాక్ అయ్యారు.
వేదిక మీద ఉన్న సీఎం సిద్దరామయ్య దగ్గరకు వెళ్లిన ఓ అభిమాని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆ ప్రత్యేక బహుమతి ఏమిటో అని తెలుసుకున్న సాటి నాయకులు, అక్కడ ఉన్న కార్యకర్తలు షాక్ అయ్యారు. కొళ్లేగాళలో ఈరోజు జరిగిన ప్రజావాణి సదస్సులో సిద్దప్పాజీకి ఓటు వెయ్యండి అంటే కాంగ్రెస్‌కు ఓటేయండి అంటూ ఆ అభిమాని కార్యక్రమానికి హాజరు అయిన ప్రజలకు చెప్పి వేదిక మీద ఉన్న సిద్ధరామయ్య దృష్టిని ఆకర్షించాడు.

సిద్దప్పాజీ పోరాట సమితి నాయకులు మంతెస్వామి పోరాట సమితి నాయకుడు నరసింహే గౌడ్ ప్రత్యేక బహుమతిని సీఎం సిద్దరామయ్యకు అందజేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ఓ బెత్తం బహుమతిగా ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బెత్తం చేతిలో పట్టుకున్న సీఎం సిద్దరామయ్య కూడా దాన్ని అటూఇటూ తిప్పుతూ ఆసక్తిగా దానిని పరిశీలించారు. ఈ సందర్భంగా నరసింహేగౌడ మాట్లాడుతూ బీజేపీ రైతు వ్యతిరేక వైఖరితో ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తామన్నారు. సిద్దప్పాజీ, మంతేస్వామి వర్గం ఈసారి కూడా కాంగ్రెస్‌కు అండగా నిలుస్తుందన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులోని పలు లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసిన సీఎం సిద్దరామయ్య ఇప్పుడు మైసూరు, తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యను అని ఇప్పటికే ప్రకటించిన సీఎం సిద్దరామయ్య ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాల్లో వీలైనన్ని సీట్లు గెలుచుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications