భార్య ఆమె బాయ్ ఫ్రెండ్ తో లేచిపోవడానికి సహాయం చేసిన క్లోజ్ ఫ్రెండ్, భర్తకు తెలిసి !
మహిళ వ్యామోహంలో పడిపోతే ఎంతకైనా తెగిస్తారని కొత్తగా చెప్పనవసరం లేదు. వివాహం చేసుకున్న వ్యక్తి ఇంటికి అతని స్నేహితులు వచ్చి వెలుతున్నారు. భర్త స్నేహితులు అందరూ ఆమెకు పరిచయం ఉన్నారు. ఇంటికి వచ్చి వెలుతున్న భర్త స్నేహితులకు ఆమె రుచికరంగా రకరకాల వంటలు చేసి పెడుతోంది. అియితే ఎవ్వరూ ఊహించని విధంగా భర్త స్నేహితుడి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తితో ఆమె లేచిపోయింది.
భార్య మరో వ్యక్తితో పారిపోయేందుకు సహకరించాడన్న కారణంతో స్నేహితుడిని హత్య చేసిన నిందితుడిని బెంగళూరు సిటీలోని బాగల్‌గుంటే పోలీసులు అరెస్టు చేశారు.

కిరణ్ (32), అతని స్నేహితుడు అక్షయ్ (31)లను అరెస్టు చేశామని గురువారం పోలీసులు చెప్పారు. నిందితులు ఇద్దరూ బాగల్‌గుంటేలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
అరెస్టు అయిన కిరణ్ సెకండ్ హ్యాండ్ బైక్‌లు, కార్లు విక్రయిస్తున్నాడు.
బెంగళూరులోని కెంగేరికి చెందిన హేమంత్ కిరణ్ కు స్నేహితుడు. కిరణ్, హేమంత్, అక్షయ్ చాలా కాలం నుంచి కలసిమెలసి తిరుగుతూ వ్యాపారాలు చేస్తున్నారు. హేమంత్ కంగేరిలోని బార్ అండ్ రెస్టారెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇదే బార్ అండ్ రెస్టారెంట్ లో మరిస్వామి అనే వ్యక్తి వెయిటర్ గా పని చేస్తున్నాడు. కిరణ్ ను కలవడానికి హేమంత్ బాగలకుంటేకి వచ్చి వెళ్లేవాడు. హేమంత్ వెంట తోడుగా మరిస్వామి కూడా కిరణ్ ఇంటి దగ్గరకు వచ్చేవాడు.
స్నేహితులు కిరణ్, అక్షయ్‌లను కలిసేందుకు హేమంత్ తరచూ కెంగేరి నుంచి బాగల్‌గుంటేకు వచ్చేవాడని పోలీసులు తెలిపారు. కెంగేరిలో హేమంత్ ఉన్న రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న మరిస్వామి అతని యజమాని హేమంత్ కిరణ్ ఇంటికి వచ్చినప్పుడల్లా అతనితో పాటు వెళ్లేవాడు. కిరణ్, హేమంత్, అక్షయ్ కలిసి లిక్కర్ పార్టీ చేసుకోవడానికి వెళ్లే సమయంలో కిరణ్ ఇంటి దగ్గర కారు పార్క్ చేసి మరిస్వామిని అక్కడే ఉండాలని చెప్పి వెళ్లేవాళ్లు. అయితే అదే సమయంలో మరిస్వామి కన్ను కిరణ్ భార్య హేమా మీద మీదపడింది.

రెండు నెలల క్రితం కిరణ్ భార్య హేమాతో అక్రమ సంబంధం పెట్టుకున్న మరిస్వామి ఆమెతో సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. ప్రియుడు మరిస్వామితో కలిసి ఎంజాయ్ చేస్తున్న హేమా భర్త కిరణ్ కు ఆ మ్యాటర్ లీక్ కాకుండా జాగ్రత్త పడింది. అయితే రెండు వారాల క్రితం హేమా ఆమె ప్రియుడు మరిస్వామితో కలిసి పారిపోయింది. ఇంట్లో హఠాత్తుగా అదృశ్యమైన భార్య హేమా కోసం కిరణ్ వెతకడం మొదలుపెట్టాడు.
ఇదే సమయంలో హేమంత్ అతని ఫ్రెండ్ కిరణ్ కు ఫోన్ చేసి మీ భార్య హేమా మరిస్వామితో కలిసి పారిపోయిందని చెప్పడంతో కిరణ్ షాక్ అయ్యాడు. తన భార్య హేమా ఆమె ప్రియుడు మరిస్వామితో కలిసి పారిపోవడానికి తన స్నేహితుడు హేమంత్ సహకరించాడనే అనుమానంతో నిందితుడు కిరణ్ రగిలిపోయాడు. ఇదే విషయాన్ని కిరణ్ అతని మరో స్నేహితుడు అక్షయ్ కు చెప్పాడు. ఇద్దరూ కలిసి హేమంత్ హత్యకు ప్లాన్ చేశారు.
ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో కెంగేరికి వెళ్లిన కిరణ్, అక్షయ్ తని ఫ్రెండ్ హేమంత్ ఫోన్ చేసి అతన్ని తమ వద్దకు పిలిచారు. అనంతరం హేమంత్ కు బార్‌లో మద్యం తాగించి, బాగల్‌గుంటేలోని పాపన్న లేఅవుట్‌కు తీసుకెళ్లారు. హేమంత్‌ను నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేసి పరారయ్యారు.
తీవ్రంగా గాయపడిన హేమంత్‌ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో చికిత్స ఫలించక హేమంత్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. తన భార్య హేమా పారిపోవడానికి హేమంత్ కారణం అని రగిలిపోయిన కిరణ్ అతని స్నేహితుడు అక్షయ్ తో కలిసి హేమంత్ ను చంపేశాడని పోలీసులు తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications