భార్యను బైక్ కు కట్టి ఈడ్చుకెళ్ళిన భర్త.. రోడ్డుపై ఆక్రందనల వీడియో!!
కట్టుకున్న భార్యకు అండదండగా ఉండాల్సిన వాడు భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన వాడు అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. ఎవరు ఎవరి విషయంలో చేయ సాహసించని దారుణానికి ఒడిగట్టాడు. తన అనుమతి లేకుండా సోదరీ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన భార్యను మద్యం మత్తులో ఊరంతా చూస్తూ ఉండగా కటిక రాళ్ళల్లో ఈడ్చుకుంటూ వెళ్ళాడు ఓ దుర్మార్గపు భర్త.
భార్య కాళ్ళకు తాడు కట్టి బైక్ తో ఈడ్చుకెళ్ళిన భర్త
భార్య కాళ్లకు తాడు కట్టి తన బైక్ కు ఆ తాడును కట్టి ఈడ్చుకెళ్ళి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. మట్టి, రాళ్లతో ఉన్న రోడ్లపై కాళ్లకు తాడు కట్టి ఈడ్చుకుంటూ వెళుతుంటే సదరు భార్య నొప్పితో విలవిలలాడిపోయింది. సహాయం చేయాలని ఆక్రోశించింది. భర్త చేస్తున్న దారుణమైన పనికి ఆమె శరీరానికే కాదు మనసుకి తీవ్ర గాయం అయింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చోద్యం చూసిన స్థానికులు
నడిరోడ్డు మీద భార్య కాళ్లకు తాళ్లు కట్టి బైక్ కు కట్టి ఈడ్చుకుంటూ వెళుతుంటే అక్కడ ఉన్న మిగతావారు నిమ్మకు నీరెత్తినట్లు చూశారు. ఇక కొందరు ఆ అమానుష ఘటనను వీడియో తీశారు. మొత్తం 40 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో కాపాడమని ఆ మహిళ చేసిన ఆక్రందనలు, ఆర్తనాదాలు వీడియో తీస్తున్న వారి మనసును కూడా కరిగించలేదు.
కాపాడే ప్రయత్నం చెయ్యని మహిళలు
అక్కడే వేరే మహిళ ఉన్నప్పటికీ తాడు కట్టి ఈడ్చుకెళ్తున్న ఆ అమానుష భర్తను ఆపే ప్రయత్నం చేయలేదు. ఇక కాస్త దూరం ఈడ్చుకుని వెళ్లిన తర్వాత బైక్ దిగి ఏదో సాధించినట్టు నడుం మీద చెయ్యి పెట్టుకొని తీవ్ర గాయాలతో అల్లాడుతున్న బాధితురాలని చూస్తూ నిలబడ్డాడు. ఇక ఒంటినిండా గాయాలతో బాధితురాలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ మెల్లగా పైకి లేచింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అయితే గత నెలలో జరిగినట్టు భావిస్తున్న ఈ ఘటన సోషల్ మీడియాలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో బయటకు వచ్చింది. దీంతో ఈ ఘటన పైన కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పైన మాట్లాడిన పోలీసులు రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో ప్రేమ్ రామ్ మేఘ్వాల్ భార్య జై సల్మేర్ లోని సోదరి ఇంటికి వెళ్లాలనుకుంది.
Shocking incident in Nagaur: A man, under the influence of alcohol,tied his wife to the back of a bike and dragged her on the road.The video went viral, leading to the man's arrest. Prior to this, the wife was reportedly held captive at home. She is now with her mother in Punjab. pic.twitter.com/Nfik4CJpqj
— Smriti Sharma (@SmritiSharma_) August 13, 2024
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ట్విస్ట్..
కానీ ఆమె భర్త అందుకు నిరాకరించడంతో పాటు ఆమెను వెళ్తానని అడిగినందుకు ద్విచక్ర వాహనానికి కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి చిత్రహింసలకు గురి చేశాడు. ఇక ప్రేమ్ రామ్ డ్రగ్స్ కు అలవాటు పడి పది నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది దీంతో మహిళల అక్రమ రవాణా కోణంలోను దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం తీవ్రగాయాల పాలైన మహిళా జైసల్మేర్ లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications