భార్య నర్సు, అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను రోడ్లో నరికి చంపేసిన భర్త !

చెన్నై/శివగంగై: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. కూతురు పుట్టిన తరువాత భర్త విదేశాల్లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు, నాలుగు సంవత్సరాలు భర్త విదేశాల్లోనే ఉండిపోయాడు. భార్య కూడా ఉద్యోగం చేస్తున్నది. భర్త విదేశాల్లో ఉన్న సమయంలో భార్య అతన్ని వదిలేసి వేరే ఇంటికి వెళ్లిపోయింది.

విదేశాల నుంచి భర్త వచ్చాడు. భార్యతో రాజీ కావడానికి ఆమె భర్త అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని భర్తకు తెలిసింది. ఉద్యోగం చెయ్యడనికి వెలుతున్న భార్యను కొడవలితో దారుణంగా నరికేసిన భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తన పరువు తీసిందని, అందుకే చంపేశానని భర్త చెప్పడంతో పోలీసులు హడలిపోయారు.

 illicit relationship

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని కారక్కూడి సమీపంలోని దేవకోట్టై సమీపంలోని కదంబగుడి గ్రామంలో ప్రభాకరన్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాకరన్ సూర్యప్రభ అలియాస్ సూర్యా (30) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. దేవకోట్టైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభాకరన్ భార్య సూర్యా నర్సుగా పనిచేస్తున్నది. ప్రభాకరన్, సూర్యప్రభ దంపతులకు 5 ఏళ్ల కుమార్తె ఉంది.

కూతురు పుట్టిన తరువాత ప్రభాకరన్ విదేశాలకు వెళ్లాడు. గత నాలుగేళ్లుగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ప్రభాకరన్ మధ్యలో ఒక్కసారి మాత్రమే సొంత ఊరికి వచ్చాడని తెలిసింది. వివాహం చేసుకున్న తరువాత తనను గాలికి వదిలేసిన తన భర్త ప్రభాకరన్ విదేశాలకు వెళ్లిపోయాడని ఫోన్ లోనే అతని భార్య సూర్యా ఆమె భర్త ప్రభాకరన్ తో లెక్కలేనన్ని సార్లు గొడవపడిందని తెలిసింది.

ఈ క్రమంలో భార్యాభర్తలు ప్రభాకరన్, సూర్యాల మధ్య తలెత్తిన గొడవల కారణంగా సూర్యా ఆమె భర్త నుంచి విడిపోయింది. దేవకోటలోని సరస్వతీ శశకసాల వీధిలోని మునియ్య దేవాలయం సమీపంలోని ఓ అద్దె ఇంట్లో కుమార్తెతో కలిసి సూర్యా ఒంటరిగా ఉంటోంది. విదేశాల నుంచి వచ్చిన భర్త ప్రభాకరన్ అతని భార్య సూర్యాకు దగ్గర కావాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడని తెలిసింది.

 illicit relationship
కూతురితో కలిసి నివాసం ఉంటున్న సూర్యా ప్రతిరోజు ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడాని వెలుతోంది. మంగళవారం ఉదయం సూర్య యథావిధిగా ఆసుపత్రిలో ఉద్యోగం చెయ్యడానికి బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రభాకరన్ అతని భార్య సూర్యాను అడ్డుకున్నాడు. తరువాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో మాటామాటా పెరిగిపోవడంతో ప్రభాకరన్ సహనం కోల్పోయాడు.

తరువాత భాకరన్ కొడవలితో అతని భార్య సూర్యాను నడిరోడ్డులో దారుణంగా నరికి స్పాట్ లో చంపేశాడు. భార్య సూర్యను చంపేసిన ప్రభాకరన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య సూర్యాకు అక్రమ సంబంధం ఉందని, ఆమె కారణంగా తనతో పాటు తమ కుటుంబం పరువు పోయిందని, అందుకే ఆమెను చంపేశానని, ఆమె ప్రవర్తనపై అనుమానం ఉందని ప్రభాకరన్ పోలీస్ స్టేషన్‌లో చెప్పాడు. పోలీసులు ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకుని ఘటనా స్థలానికి చేరుకుని సూర్యా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+